శ్రీనగర్ : సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌ను చర్చలకు ఆహ్వానిస్తున్నామంటున్న దాయాది దేశం మరోసారి కపట బుద్ధిని బయట పెట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాక్.. చర్చలకు సిద్ధమంటూనే మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. గురువారం తెల్లవారుజామున నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పూంచ్‌లోని కృష్ణ ఘటీ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ పన్నాగాన్ని పసిగట్టిన భారత జవాన్లు ఇందుకు దీటుగా బదులిచ్చారు. సుమారు గంటపాటు ఎదురుకాల్పులు జరిపి పాక్ సైన్యాన్ని తరిమికొట్టారు.
కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పాక్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలన్నీ మూసివేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment