
టెక్సాస్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 40 మంది భద్రతాదళ సభ్యల ప్రాణాలను బలిగొన్న తీవ్రవాదుల అమానవీయ ఘటన యావత్ దేశాన్నీ కుదిపేసింది. ఆస్టిన్ ఇండియన్ టీం ఆధ్వర్యంలో ఆస్టిన్ లో వీర సైనికులకు ప్రవాస భారతీయులు నివాళులు అర్పించారు. ఈ ఘటనలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు తోడుగా నిలవడానికి 2k రన్ నిర్వహించి వచ్చిన ఫండ్‌ని bharatkeveer.gov.in లో డొనేట్ చేయడం జరిగింది.
తీవ్ర వాదం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యంగా భారత దేశం గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రవాదంతో ఇబ్బంది పడుతోందన్నారు. ప్రపంచ దేశాలు అన్ని కలిసి తీవ్రవాదం మీద పోరాడి తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించివేయాలని ప్రపంచదేశాలకి విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ దేశం పెంచిపోషిస్తోందని, అనేక తీవ్రవాద సంస్థలకి పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని ఆస్టిన్ ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ సైతం ఈ తీవ్రవాదంతో అనేక ఇబ్బందులు పడటమే కాకుండా తన దేశంలో ఉన్న అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటోదని, మిగిలిన దేశాల్లో సైతం తీవ్రవాద భావజాల వ్యాప్తికి ఆ దేశం సహకరించడమే కాకుండా తీవ్రవాదులకి అన్ని రకాలుగా సహాయపడుతూ దాడులకి వారిని ప్రోత్సహించడం దారుణమని ప్రపంచ దేశాలన్నీ కలిసి అలాంటి దేశాల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి కష్ట సమయంలో భారత దేశంలో ఉన్న ప్రజలంతా తమ దేశపు సైన్యానికి, వీరమరణం పొందిన కుటుంబ సభ్యులకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆస్టిన్ ఇండియన్ టీం ఆర్గనైజర్లు సుబ్బా రెడ్డి చింతగుంట, పుల్లా రెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి , సతీష్ యెన్న, దుశ్యంత్ వంగల తో పాటు మరెంతోమంది పాల్గొని వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు తోడుగా నిలవడానికి తరలివచ్చారు.





Comments
Please login to add a commentAdd a comment