తల్లులారా.. మీ పిల్లలను ఉగ్రవాదంలో చేరనివ్వకండి | Army is Appeal To Jammu and Kashmir Mothers to Prevent Your Sons from Becoming Terrorists | Sakshi
Sakshi News home page

‘మీ పిల్లలను ఉగ్రవాదంలో చేరనివ్వకండి’

Published Sat, Mar 9 2019 1:34 PM | Last Updated on Sat, Mar 9 2019 3:12 PM

Army is Appeal To Jammu and Kashmir Mothers to Prevent Your Sons from Becoming Terrorists - Sakshi

నేను ప్రతి తల్లిని వేడుకుంటున్నా. హింసను ప్రేరేపిస్తూ అమయాకుల ప్రాణాలను తీసే

జమ్మూ : ‘కశ్మీర్‌లోని ప్రతి తల్లిని వేడుకుంటున్నా.. మీ పిల్లలను దయచేసి ఉగ్రవాదం వైపు వెళ్లనివ్వకండి’ అని భారత ఆర్మీ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ కాన్వాల్‌ జీత్‌ సింగ్‌ ధిలాన్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఉగ్రవాదానికి ప్రభావితమై.. వారి ఉచ్చులో చిక్కుకున్నవారు.. తిరిగి రావాలనుకుంటే వారికి భారత ఆర్మీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘నేను ప్రతి తల్లిని వేడుకుంటున్నా. హింసను ప్రేరేపిస్తూ అమయాకుల ప్రాణాలను తీసే ఉగ్రవాదం వైపు మీ పిల్లలు ఆకర్షితులు కాకుండా చూసుకోండి. ఇప్పటికే ఎవరైనా అలా చేరి.. తిరిగి రావాలంటే చెప్పండి. వారికి భారత సైన్యం అండగా ఉంటుంది. వారికి సాధారణ జీవితంలోకి తీసుకురావాడానికి కృషి చేస్తోంది.’ అని వ్యాఖ్యానించారు.

ఆర్మీ పాసింగ్‌ పరేడ్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన 152 మంది యువకులు భారత సైన్యంలో చేరారాని పేర్కొన్నారు. ఇక పుల్వామా ఉగ్రదాడి అనంతరం భావోద్వేగంగా మాట్లాడిన ధిలాన్‌.. తుపాకులతో తిరిగే యువకులను లొంగిపోవాలని, లేకుంటే కాల్చేస్తామని హెచ్చరించారు. అలాగే కశ్మీర్‌ సమాజంలో తల్లికి ఎంతో బాధ్యత ఉంటుందని, ఎవరైతే ఉగ్రవాదులతో చేయికలిపారో అలాంటి వారి తల్లులు ఒక్కసారి వారిని పిలిపించే ప్రయత్నం చేయాలని ఉగ్రవాదం వీడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement