‘పుల్వామా దాడి గురించి ముందే తెలుసు’ | Jaish Commander Nisar Ahmad Tantray Says He Knew About Pulwama Attack | Sakshi
Sakshi News home page

సంచలన విషయాలు వెల్లడించిన జైషే కమాండర్‌

Published Tue, Apr 9 2019 4:09 PM | Last Updated on Tue, Apr 9 2019 5:27 PM

Jaish Commander Nisar Ahmad Tantray Says He Knew About Pulwama Attack - Sakshi

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని దేశం ఎన్నటికి మర్చిపోదు. ఈ దారుణ సంఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి గురించి తనకు ముందే తెలుసు అంటున్నాడు జైషే మహ్మద్‌ కమాండర్‌ నిసర్‌ అహ్మద్‌ తంత్రి. ఈ దాడికి సంబంధించి విచారణ నిమిత్తం నిసర్‌ను రెండు రోజుల క్రితం దుబాయ్‌ నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిసర్‌ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ సూచనలతోనే ఈ దాడి జరిగిందని నిసర్‌ తెలిపాడు.

ఈ దాడిలో ప్రధాన కుట్రదారైన ముదాసిర్‌ ఖాన్‌ దాడి చేయడానికి ముందు తనకు ఫోన్‌ చేశాడని.. త్వరలో తాము జరపబోయే బ్రహ్మాండమైన దాడిలో భాగం కావాల్సిందిగా తనను కోరాడని వెల్లడించాడు. జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ సూచనల మేరకే ఈ దాడి చేయబోతున్నట్లు ముదాసిర్‌ తనకు చెప్పాడని నిసర్‌ పేర్కొన్నాడు. జైషే సంస్థకు చెందిన ఒక కమాండర్‌ పుల్వామా దాడిలో జైషే పాత్ర ఉన్నట్లు ధ్రువీకరించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ విషయంలో భారత్‌ ఇప్పటివరకూ ఇంటెలిజెన్స్‌ సమాచారంపై ఆధారపడుతూ వచ్చింది. అయితే ఈ విషయాల గురించి విచారణతో సంబంధం ఉన్న ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement