Nisar Ahmed
-
మైనార్టీ అయిన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు: నిసార్ అహ్మద్
-
సులభ సుందర కవి
జనప్రియ కవిగా పేరు మోసిన కన్నడ కవి కె.ఎస్.నిసార్ అహమద్ మే 3న బెంగళూరులో తన 84వ యేట క్యాన్సర్‌తో మరణించారు. భూగర్భ శాస్త్ర ఆచార్యులుగా పనిచేసిన నిసార్ పద్మశ్రీ, పంప ప్రశస్తి, గౌరవ డాక్టరేట్లతో సన్మానింపబడ్డారు. వినాయక కృష్ణ గోకాక్, ఎం.గోపాలకృష్ణ అడిగ 1950 ప్రాంతంలో ప్రతిపాదించిన నవ్య కవిత్వం ఉద్యమంలో పుట్టుకొచ్చిన కవుల్లో నిసార్ పేర్కొనదగినవారు. ఆంగ్ల కవులైన ఇలియట్, ఆడెన్, డిలాన్ థామస్, ఏట్స్, స్టీఫన్ స్పెండర్ మొదలైనవాళ్ల కవిత్వానికి ప్రభావితులై కన్నడంలో స్వాంతంత్య్రం తర్వాత నెలకొన్న రాజకీయ, సాంఘిక దుస్థితులకు ప్రతిస్పందిస్తూ వచ్చిందే నవ్య కవిత్వం. విషమ పరిస్థితుల వాస్తవిక చిత్రణ, వచన కవితా శైలి, స్వానుభవ అభివ్యక్తి, బౌద్ధికతా ప్రాధాన్యం, నూతన ప్రతీకల, పదచిత్రాల ప్రయోగం, సూటితనం, వ్యంగ్యం దీని లక్షణాలు. బి.సి.రామచంద్రశర్మ, జి.ఎస్.శివరుద్రప్ప, చెన్నవీరకణవి, పి.లంకేశ్, చంద్రశేఖర పాటీల్, చంద్రశేఖర కంబార, సుమతీంద్ర నాడిగ మొదలైనవాళ్లు తమతమ వ్యక్తిగత ముద్రలతో కవితలు రచిస్తే, నిసార్ సులభ, సుందర శైలిలో రాసి విశాల పాఠక సముదాయాన్ని సంపాదించుకున్నారు. సంప్రదాయ, నవ్య కవుల, యువకవులతో పాలలో పంచదారలా కలిసిపోయినందువల్ల నిసార్ కవిత్వంలో ప్రబుద్ధతతో పాటు సంవేదన కూడా సుతారంగా సంగమించింది. సమకాలీన సమవయస్కుల కవితల్లో బౌద్ధికత పైచెయ్యి కాగ, ఈయన కవితల్లో సహృదయత, సారళం, సహజత్వం త్రివేణిగా రూపొందాయి. నిసార్ కవిత్వంలో అన్యాయానికీ, అక్రమానికీ ప్రతిఘటన వుంది కానీ సాత్విక రూపంలో, సంస్కారవంతమైన రీతిలో. ఆవేశం లేదు, అనుభవం వుంది, అనురాగమూ వుంది. ఆయన కవితా సంకలనం నిత్యోత్సవ 1976లో వెలువడి, 1978లో క్యాసెట్ రూపంలో విడుదలైంది. మధుర లలిత సంగీత గాయకుడు మైసూరు అనంతస్వామి సంగీత సారథ్యంలో వెలువడ్డ ఈ క్యాసెట్ కర్ణాటకలో జయభేరి మోగించింది. ‘నిత్యోత్సవం తల్లి నిత్యోత్సవం నీకు నిత్యోత్సవం’ అంటూ మొదలైన గీతం జోగ్ జలపాతం వెలుగు జిలుగులతో, తుంగానది హొయలతో, సహ్యాద్రి పర్వత నీలుగులతో, సతత హరిత అరణ్యాల పచ్చదనంతో ప్రకృతి కర్ణాటక మాతకు నీరాజనం పడుతున్నదని నిసార్ నివాళులు అర్పించారు. నిసార్ కవితా వస్తువు సామాన్యమైనదిగా కనిపించినా, కవి అంతర్ దృష్టి ఆ కవితకు విశిష్టతను సంతరించిపెడ్తుంది. ‘రామన్ సత్త సుద్ది’ (సర్ సి.వి.రామన్ మరణ వార్త) తనకు గొప్ప విషయంగా తోచినా, సామాన్య ప్రజల్లో ఎలాంటి కదలిక కలిగించకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. పేరు ప్రతిష్ఠల్ని ఆశించినా, వాటి పరిమితుల్ని అర్థం చేసుకోవాలన్న బోధ కలిగిస్తుంది ఈ కవిత. ‘నిమ్మొడ నిద్దూ నిమ్మంతాగదె’(మీతో వున్నా, మీవాడు కాని) కవిత, కవి ప్రజల్లో మమైక్యమైనా దూరం చేయబడ్డ విజాతీయుని బాధను వ్యక్తం చేస్తుంది. నిసార్ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లోని ఉదాత్తతను ప్రశంసించారు. లోపాల్ని సుతిమెత్తగా సూచించి బాధపడ్డారు. -ఘట్టమరాజు -
‘పుల్వామా దాడి గురించి ముందే తెలుసు’
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని దేశం ఎన్నటికి మర్చిపోదు. ఈ దారుణ సంఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి గురించి తనకు ముందే తెలుసు అంటున్నాడు జైషే మహ్మద్ కమాండర్ నిసర్ అహ్మద్ తంత్రి. ఈ దాడికి సంబంధించి విచారణ నిమిత్తం నిసర్ను రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిసర్ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సూచనలతోనే ఈ దాడి జరిగిందని నిసర్ తెలిపాడు. ఈ దాడిలో ప్రధాన కుట్రదారైన ముదాసిర్ ఖాన్ దాడి చేయడానికి ముందు తనకు ఫోన్ చేశాడని.. త్వరలో తాము జరపబోయే బ్రహ్మాండమైన దాడిలో భాగం కావాల్సిందిగా తనను కోరాడని వెల్లడించాడు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సూచనల మేరకే ఈ దాడి చేయబోతున్నట్లు ముదాసిర్ తనకు చెప్పాడని నిసర్ పేర్కొన్నాడు. జైషే సంస్థకు చెందిన ఒక కమాండర్ పుల్వామా దాడిలో జైషే పాత్ర ఉన్నట్లు ధ్రువీకరించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ విషయంలో భారత్ ఇప్పటివరకూ ఇంటెలిజెన్స్ సమాచారంపై ఆధారపడుతూ వచ్చింది. అయితే ఈ విషయాల గురించి విచారణతో సంబంధం ఉన్న ఓ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. -
వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయండి
సాక్షి, బెంగళూరు :వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలు తగ్గిపోతాయని ప్రభుత్వానికి ప్రముఖ సాహితీ వేత్త నిసార్ అహమ్మద్ సూచన చేశారు. వేశ్యా వృత్తి ఇతివృత్తంగా ఫొటో గ్రాఫర్ సుధీర్శెట్టి స్థానిక చిత్రకళాపరిషత్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు విధిలేని పరిస్థితుల్లో వేశ్యా వృత్తిని చేపట్టిన వారిపట్ల వివక్ష చూపుతున్నాయని విమర్శించారు. చట్టబద్ధత కల్పించడం వల్ల ఈ వృత్తిలో ఉన్న వారికి తరుచుగా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని, దీని వల్ల అనేక సంక్రమిక రోగాలను ముందుగానే అరికట్టేందుకు వీలవుతుందని చెప్పారు. కాగా, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సమాచారశాఖ మంత్రి రోషన్‌బేగ్ ఈ విషయంపై స్పందిస్తూ... సింగపూర్ వంటి దేశాల్లో వేశ్యా వృత్తికి చట్టబద్దత ఉందన్నారు. అయితే ఇలాంటి చట్టాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు.