
చెన్నై: భారత క్రికెటర్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పుల్వామాలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా అలాంటి పనే చేయబోతోంది. తమ సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్‌లో టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని జవాన్ల కుటుంబాలకు అందజేయనుంది. ఈ నెల 23న చెన్నైలో జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో సీఎస్‌కే తలపడుతుంది. ధోని, కోహ్లి జట్ల మ్యాచ్ కావడంతో టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో సమకూరిన మొత్తాన్ని చెక్ రూపంలో చెన్నై కెప్టెన్ ధోని చేతుల మీదుగా అదేరోజు అందజేస్తారని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment