సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలలోపు పుల్వామా ఉగ్రదాడి లాంటి ఘటన మరోకటి జరిగే అవకాశం ఉందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. సైనికుల త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎంఎన్‌ఎస్పీ 13వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా శనివారం పార్టీ ముఖ్యనేతల సమావేశంలో రాజ్ ఠాక్రే మాట్లాడారు. పాక్‌పై మరోసారి దాడి చేసి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని మోదీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.
గతంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పాక్‌పై మెరుపు దాడులు చేశారని అన్నారు. అంతకుమందే భారత ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా కలిసినట్లు ఠాక్రే గుర్తుచేశారు. భారత వైమానిక దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అమిత్ షా ఎలా ప్రకటిస్తారని, ఆయన ఏమైనా కో ఫైలట్టా అని ప్రశ్నించారు. పాక్‌తో ఉగ్రదాడి పొంచిఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించినప్పటికీ సరిహద్దుల్లో భద్రతను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment