శ్రీనగర్: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద దాడులు జరగొచ్చని భారత్, అమెరికాకు పాకిస్థాన్ నిఘా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అవంతిపురలో శక్తిమంతమైన ఐఈడీ బాంబులతో కూడిన వాహనాలతో ముష్కరులు పేలుళ్లకు పాల్పడవచ్చని పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేసింది. గత నెలలో కశ్మీర్‌లో ఆర్మీ నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్‌లో ఉగ్రవాది జకీర్ మూసా హతమయ్యాడు. దీనికి ప్రతీకారంగా ఉగ్రదాడులు జరుగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. అవంతిపురకు 7 కిలోమీటర్ల దూరంలోనే ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వెంట గస్తీని మరింత పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment