
సాక్షి, పల్నాడు జిల్లా: నాగార్జునసాగర్ డ్యాంపైన యథాస్థితి కొనసాగుతోంది. 14వ గేట్ నుంచి 26 గేట్ వరకు ప్రాజెక్టుపై ఆంధ్ర భూభాగంపై ఏపీ పోలీసుల పహారా కాస్తున్నారు.1వ గేటు నుంచి 13వ గేటు వరకు ప్రాజెక్టు తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉంది. ఇరువైపులా భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించారు.
కేంద్ర బలగాలు నాగార్జున సాగర్‌కు చేరుకున్నాయి. ఇంకా ఇరు రాష్ట్రాల పోలీసుల బలగాల ఆధీనంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉంది. మరి కొద్ది సేపట్లో నాగార్జునసాగర్ డ్యాం పైకి సీఆర్పిఎఫ్ బలగాలు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment