మావోయిస్టులపై ‘డ్రోన్‌’ వెపన్‌ | Center Plans to Heavy use of Drones | Sakshi
Sakshi News home page

మావోయిస్టులపై ‘డ్రోన్‌’ వెపన్‌

Published Sun, Sep 23 2018 3:18 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

Center Plans to Heavy use of Drones - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టుల కదలికల నియం త్రణకు కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్రం నూతన డ్రోన్‌ పాలసీని ప్రక టించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పాలసీ ద్వారా మావోయిస్టుల నియం త్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని భావిస్తోంది. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సెక్యూరిటీ ఎక్స్‌పో లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్య లు ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కలవరం సృష్టిస్తు న్నాయి. కొత్త డ్రోన్‌ పాలసీ ద్వారా దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతోపాటు మావోయిస్టులు, తీవ్రవాద సమస్యను తుడిచివేస్తామన్నారు. త్వరలోనే కార్యాచరణ ఉంటుందని, దేశ అంతర్గత భద్రతాబలగాలకు డ్రోన్లను అందుబాటులోకి తెచ్చేం దుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. 

రంగంలోకి ఐదు రకాల డ్రోన్లు...
డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ మార్గదర్శకా ల ప్రకారం ఐదు రకాల డ్రోన్లను అందుబాటులోకి తేబోతున్నారు. ఇందులో నానో డ్రోన్‌ 250 గ్రాముల బరువు మాత్రమే ఉంది. మైక్రోడ్రోన్‌ 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు వరకు ఉంటుంది. స్మాల్‌ డ్రోన్‌ 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. మీడియం డ్రోన్‌ 25 కిలోల నుంచి 150 కిలోల బరువు, లార్జ్‌డ్రోన్‌ 150 కిలోలకు పైబడి బరువుం టుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవులకే పరిమితమైన మావోయిస్టుల కార్యకలాపాలను మరింత నియంత్రించి, మావోయి స్టు కదలికలను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకు ఈ డ్రోన్లను ఉపయోగించాలని సీఆర్‌పీఎఫ్‌కు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసిం ది. గతంలో రోబోల ద్వారా మావోయిస్టులను ఎదు ర్కొనేందుకు కొంత ప్రయత్నించినా ఆశించిన çఫలితా లు రాలేదు. దీనితో ఈసారి గగనతలం నుంచి మావోయిస్టు కార్యకలాపాలను గుర్తించి, ఎన్‌కౌంట ర్‌ వ్యవహారాలను డ్రోన్‌ ద్వారా బలగాల ఆపరేటిం గ్‌కు ఉపయోగించుకునేందుకు ఈ వ్యవస్థను అంది పుచ్చుకోవాలని హోంశాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది. 

సీఆర్‌పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్‌...
కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్‌ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ఇందుకుగాను ప్రతీ సీఆర్‌పీఎఫ్‌ బేస్‌ క్యాంపులో రెండు నుంచి 4 డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఆయా బేస్‌ క్యాంపుల నుంచి ఢిల్లీ వరకు అనుసంధానం చేసేందుకు సీఆర్‌పీఎఫ్‌ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరేశక్తి ఉంటుంది. వీటి ద్వారా డే టైమ్‌లో హెడ్‌టీ క్వాలిటీ వీడియో, ఫొటోలు చిత్రీకరించడం సులభమని నిఘావర్గాలు భావిస్తున్నాయి. వీటికన్నా బరువున్న వాటిని ఉపయోగించడం వల్ల శత్రువు అప్రమత్తమవుతాడని, ఇవి చేసే శబ్దం వల్ల టార్గెట్‌ మిస్‌ఫైర్‌ అయ్యే ప్రమాదముంటుందని నిఘా అధికారులు భావిస్తున్నారు. 

సమాచార మార్పిడి తప్పనిసరి
డ్రోన్ల ద్వారా మావోయిస్టుల కదలికల ను ఎప్పటికప్పుడు గుర్తించడమే కాకుండా ఆయా ప్రభావిత రాష్ట్రాల ప్రత్యేక విభాగా లకు సమాచారమివ్వాలని కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్‌తోపాటు కోబ్రా తదితర విభాగా లకు సూచించింది. రాష్ట్రాల్లో ఉన్న మావోయి స్టుల కార్యకలాపాలు స్థానిక పరిస్థితులను çప్రభావితం చేస్తాయని, ఇందులో భాగంగా అక్కడి రాష్ట్రాల స్పెషల్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరోల పని కూడా కీలకమని సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement