చెన్నై: రెండేళ్ల క్రితం ఉగ్రమూకలు దొంగలాగా దాడిచేసి 40 మంది భారత జవానులను పొట్టన పెట్టుకున్న రోజు దేశ చరిత్రలో చీకటి రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14 న దాదాపు 2500 మంది సీఆర్‌పీఎఫ్ దళాలు 78 బస్సుల్లో జమ్ముకశ్మీర్ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. జైషే మహమ్మద్ కు చెందిన ఆత్మహుతి దళాలు సీఆర్‌పీఎఫ్ బస్సుపై దాడిచేశారు. ఆ ఘటనలో 40 మంది అసువులు బాశారు. తమిళనాడులో పర్యటనలో భాగంగా మోదీ.. ఆరోజు ఘటనను గుర్తుచేసుకొని వారికి ఘననివాళుర్పించారు. ఈ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ మరవదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపనలు చేశారు మోదీ.
ఈ క్రమంలోనే స్వదేశీ పరిజ్జానంతో అభివృద్ధి చెందిన అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంక్ (మార్క్1ఎ)ను చెన్నైఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణేకు అందజేశారు. భారత్ ఉన్న రెండు రక్షణ కారిడర్‌లలో ఒకటి తమిళనాడులో ఉంది. దీనికి 8,100 కోట్లను ప్రాథమికంగా నిర్ణయించారు.వీటితోపాటు 9 కిలోమీటర్ల పొడవుగల చెన్నై మెట్రోతోపాటు, రెండు రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపను చేశారు. మద్రాస్‌లో ఐఐటీ క్యాంపస్ నిర్మాణానికి వెయ్యికోట్లవుతొందని కూడా అంచనావేశారు. దీనితోపాటు అనైకట్ కెనాల్ పునర్నిర్మాణ పనులకు కూడా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment