ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 2017లో స్వచ్ఛంద పదవీవిరమణ, రాజీనామాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వెల్లడించింది. ముఖ్యంగా సరిహద్దు భద్రతా దళం, కేంద్ర రిజర్వు పోలీస్ బలగాల్లో ఎక్కువ మంది సిబ్బంది వైదొలిగారని పేర్కొంది. 2015లో 909 మంది బీఎస్‌ఎఫ్ నుంచి నిష్ర్కమించగా, 2017లో ఈ సంఖ్య ఏడు రెట్లు అధికంగా 6415కు పెరిగిందని తెలిపింది.
సీఆర్‌పీఎఫ్‌లో 2015లో 1376 మంది వైదొలగా, 2017లో అత్యధికంగా 5123 మంది వైదొలిగారని వెల్లడించింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సహస్త్ర సీమా బల్‌లోనూ ఇదే ధోరణి కనిపించిందని పేర్కొంది. ఇక అస్సాం రైఫిల్స్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలోనూ పెద్దసంఖ్యలో సిబ్బంది వైదొలిగారని తెలిపింది. వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాలతో పాటు 20 ఏళ్ల సర్వీస్ అనంతరం పెన్షన్ ప్రయోజనాలు పెరగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో స్వచ్ఛంద పదవీవిరమణ లేదా రాజీనామా చేయడానికి మొగ్గుచూపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment