న్యూఢిల్లీ : ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ (ఎమ్‌ఎఫ్‌ఎన్)ను భారత ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టేటస్‌ను కొనసాగించాలని, కానీ ఎమ్‌ఎఫ్‌ఎన్‌లోని ‘ఎఫ్’ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు.
I have some news for Pakistan. We should continue their ‘MFN’ status. Only thing is, that this time we the civilians will decide what ‘F’ stands for. https://t.co/5SsC6BlDvT
— Gautam Gambhir (@GautamGambhir) February 16, 2019
‘పాకిస్తాన్ గురించి ఓ వార్త విన్నాను. మనం ఆ దేశానికిచ్చిన ఎమ్‌ఎఫ్‌ఎన్ స్టేటస్‌ను కొనసాగిద్దాం. కానీ ఇందులోని ఎఫ్ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై భారత నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తుండగా పాక్ నెటిజన్లు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత నెటిజన్లు ఎఫ్‌కు తమ తోచిన అర్థాన్ని ఇస్తూ కామెంట్ చేస్తుండగా.. పాక్ నెటిజన్లు మాత్రం.. ఈ దాడిలో తమ దేశ ప్రమేయమే లేదని సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు.
జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి అనంతరం తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేసిన గంభీర్.. ఇప్పటి వరకు జరిగింది చాలని.. వెంటనే పాకిస్తాన్‌తో యుద్దం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఉగ్రదాడిని ఖండించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఎమ్‌ఎఫ్‌ఎన్ స్టేటస్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేస్తామని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు సహకరించేవారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించారు. (చదవండి: ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్)
Comments
Please login to add a commentAdd a comment