‘ద్వేషమెన్నటికి సమాధానం కాదు’ | Bollywood Condemn Pulwama Attack | Sakshi
Sakshi News home page

‘ద్వేషమెన్నటికి సమాధానం కాదు’

Published Fri, Feb 15 2019 2:37 PM | Last Updated on Fri, Feb 15 2019 3:24 PM

Bollywood Condemn Pulwama Attack - Sakshi

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగ‌తి తెలిసిందే. ఈ ఉగ్ర‌దాడిలో 43 మంది ప్రాణాలు కోల్పోగా కొంద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ దాడిని రాజ‌కీయాల‌కు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించారు.  బాలీవుడ్‌ కూడా ఈ దారుణాన్ని ఖండిస్తోంది

మ‌న‌ల‌ని కంటికి రెప్పలా కాపాడుతున్న జ‌వాన్లు ఉగ్రదాడిలో మ‌ర‌ణించడం మ‌న‌సుని క‌లచి వేసింది. ప్రాణాలు విడిచిన జ‌వాన్ల కుటుంబాల‌కి అండ‌గా నిల‌బ‌డ‌డం మ‌న బాధ్యత. - స‌ల్మాన్ ఖాన్‌

పుల్వామా ఘ‌ట‌న‌తో ఒక్కసారిగా షాక్ అయ్యాను. ద్వేషం ఎన్నటికి సమాధానం కాలేదు. ఉగ్ర దాడిలో గాయ‌ప‌డ్డ జ‌వాన్ల ఆత్మకి శాంతి క‌లగాల‌ని, వారి కుటుంబాల‌కి ధైర్యం అందించాల‌ని దేవుడిని కోరుకుంటున్నాను. - ప్రియాంక చోప్రా

పుల్వామా దాడి అమానుషం, అమానవీయం. కోపాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. - అజయ్‌ దేవగణ్‌

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సైనికుల‌పై జ‌రిగిన దాడిని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఈ ఘ‌ట‌న‌ని ఎప్పటికి మ‌ర‌చిపోలేము. దాడిలో గాయ‌ప‌డ్డ వారు త్వరగా కొలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. మ‌ర‌ణించిన వారి ఆత్మల‌కి శాంతి క‌లగాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. - అక్షయ్‌ కుమార్

పుల్వామా ఘ‌ట‌నకి సంబంధించిన వార్త న‌న్ను ఎంత‌గానో క‌ల‌చి వేసింది. దాడిలో మ‌ర‌ణించిన వారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని, వారి కుటుంబానికి దేవుడు కొండంత ధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు. - అనుష్క శ‌ర్మ‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement