ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం | Two JeM Terrorists Killed In Jammu And Kashmirs Baramulla District | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Published Fri, Feb 22 2019 8:35 PM | Last Updated on Fri, Feb 22 2019 8:45 PM

Two JeM Terrorists Killed In Jammu And Kashmirs Baramulla District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కశ్మీర్‌: బారాముల్లా జిల్లా సోపోర్‌ పట్టణంలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం జరగలేదని, అలాగే జవాన్లు ఎవరికీ గాయాలు కాలేదని దక్షిణ కశ్మీర్‌ డీఐజీ అతుల్‌ కుమార్‌ గోయల్‌ తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. అలాగే సంఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలోనికి జవాన్లు చెప్పేంతవరకు ప్రజలు ఎవరూ రావద్దని ఓ ప్రకటనలో డీఐజీ తెలిపారు. కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా ఇళ్లను తనిఖీ చేస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్లపైకి కాల్పులు జరిపారని, రెప్పపాటులో జవాన్లు స్పందించి ఎదురు కాల్పులకు దిగడంతో జవాన్లు మట్టికరిచారని డీఐజీ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement