రూ.2 వేల నోట్లు ఎందుకు?
చిత్తశుద్ధి ఉంటే అధికారపార్టీ ఎంపీలు,
ఎమ్మెల్యేల నల్లధనాన్ని వెలికితీయండి
సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్
గుంతకల్లు టౌన్ : పెద్ద నోట్లు రద్దు చేస్తూనే రూ.2 వేల నోట్లను ఎందుకు ముద్రించారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేరులతో మాట్లాడారు. మోదీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొనసాగుతున్న అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు దాచుకున్న నల్లధనాన్ని వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు సాహోసపేతమైన నిర్ణయమని బీజేపీ నేతలు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ ఏడుసార్లు పెద్ద నోట్ల రద్దు జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. మోదీకి అనుకూలమైన ఆదానీ గ్రూప్‌కు విదేశాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఓ జాతీయ బ్యాంకు నుంచి రూ.6 వేల కోట్ల రుణం ఇప్పించలేదా అని ఆయన నిలదీశారు.
ఓఎ¯Œన్జీసీ, కేజీబేసి¯న్ గ్యాస్‌లను అక్రమంగా అమ్ముకుని కోట్లాది రూపాయలను రిలయ¯Œ్స కంపెనీ దోచేసిందని కాగ్ తన నివేదికలో పేర్కొందన్నారు. ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోని పెద్దమనుషులు అవినీతిని నిర్మూలిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నీతి, నిజాయితీ కలిగిన నేత అయితే గుంటూరులో జరిగిన సమావేశంలో ఆయా పార్టీ ఎమ్మెల్యేలకు షీల్డ్ కవర్లల్లో ఏం ఇచ్చారో చెప్పాలన్నారు. టీడీపీకి అనుకూలమైన పత్రికలే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిపై వరుస కథనాలు ప్రచురించాడాన్ని బట్టి అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోందన్నారు. సీపీఎం డివిజ¯ŒS కార్యదర్శి డి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి భజంత్రీ శీనా, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.