rambhupal
-
విశాఖ స్టీల్ ప్లాంట్.. బీజేపీ నేతకు సీపీఎం నేత దిమ్మతిరిగే కౌంటర్
-
ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రైవేటుపరం
ఆత్మకూరు: ప్రజాపంపిణీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదరి రాంభూపాల్ విమర్శించారు. మండల కేంద్రంలో సీపీఎం 6వ మండల మహాసభల్లో భాగంగా శనివారం ఆయన ఆత్మకూరు పాత సిండికేట్ బ్యాంకు వద్ద సీపీఎం జెండాను ఆవిష్కరించి సీపీఎం నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన మహాసభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 29 వేల రేషన్ దుకాణాలుండగా వాటిలో 6,500 దుకా ణాలను రిలయన్స్ ఫ్యూచర్ కంపెనీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొదటగా మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోందని, వాటిలో అనంతపురం కూడా ఉందని తెలిపారు. రేషన్ దుకాణాలను ప్రైవేటీకరించడం వల్ల బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల వద్ద మాత్రం తక్కువ ధరలకే కొనుగోలు చేస్తారన్నారు. 36 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి 30 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేసి ప్రైవేటు విద్యను పరిమితిలో ఉంచాలన్నారు. అంతేకాకుండా జిల్లాలో రూ.113 కోట్ల ఉపాధి హామీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం రూ.41.13 కోట్లు మాత్రమే కూలీలకు వచ్చాయన్నారు. కోటికి పైగా బిల్లులు అందాల్సిన మండలాలు 17 వరకు ఉన్నాయన్నారు. ముఖ్యంగా జిల్లా మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే కూలీల బిల్లులు కోట్లలో పెండింగ్‌లో ఉండటం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా రైతు సంఘం కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి , నియోజకవర్గ నాయకుడు రామాంజినేయులు, మండల నాయకులు శివశంకర్, శివ, సోము, రాము, వలి, జయమ్మ, రాజేశ్వరమ్మ పాల్గొన్నారు. -
‘ఉపాధి బిల్లులు తక్షణం చెల్లించాలి’
అనంతపురం అర్బన్ : ఉపాధి కూలీలకు తక్షణమే బిల్లులు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు బిల్లులు రూ.28.72 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని విడుదల చేయకుండా వలసల నివారణ సాధ్యపడదన్నారు. పెనుకొండ మండలం అడదాకులపల్లి దళిత కాలనీ కూలీల గోవిందప్పకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వనందుకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు. ఆయన ఆరు వారాలు చేసిన కూలికి సంబంధించి రూ.5,700 బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. ఒక్క పెనుకొండ మండలంలోనే రూ.56 లక్షలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లో లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలో లక్షలాది మంది వ్యవసాయ కూలీలు, పేద రైతులు వలసలు పోతుంటే నివారించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధి హామీ కింద గిట్టుబాటు కాని పనులు చేయించి నెలల కొద్దీ బిల్లులు పెండింగ్ ఉంచుతూ పేదలను ఈ పథకానికి దూరం చేస్తోందని దుమ్మెత్తిపోశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఒ.నల్లప, కార్యవర్గ సభ్యులు బి.హెచ్.రాయుడు పాల్గొన్నారు. -
వెనుకబడిన ప్రాంతాలకు తీరని అన్యాయం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : వెనుకబడిన ప్రాంతాలకు బడ్జెట్లో తీరని అన్యాయం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ కేంద్రం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2017–18కి కేటాయించిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందన్నారు. గత బడ్జెట్ కంటే పెద్ద బడ్జెట్ ఉన్న అంకెల్లో వెనుకబడిన ప్రాంతాలకు ఒరిగిందేమి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే చర్యలు ఇందులో లేవన్నారు. రాయలసీమ ప్రాంతానికి రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర బడ్జెట్ లోటు పూడ్చడానికి ఇస్తామన్న నిధులపై ఎలాంటి ప్రస్తావన చేయలేదన్నారు. రైతులకు ఫసల్‌బీమా యోజన కింద కేటాయించే మొత్తాన్ని రూ.13,240 కోట్ల నుంచి రూ.9000 కోట్లకు కుదించారన్నారు. డీమానిటైజేషన్ ద్వారా రైతులు, కూలీలు నష్టపోయిన పరిహారం బడ్జెట్లో చోటు చేసుకోలేదన్నారు. నీతి ఆయోగ్ పేరుతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం బడ్జెట్లో ఆమేరకు కేటాయింపులు జరగలేదన్నారు. దేశ జనాభాలో 17 శాతం ఉన్న ఎస్సీలకు 2.44 శాతం, 7 శాతం ఉన్న గిరిజనులకు 1.48 శాతం మాత్రమే కేటాయించడం బీజేపీ దళిత, గిరిజన వ్యతిరేక వైఖరికి అద్దం పడుతుందన్నారు. చేనేత రంగానికి గతేడాది రూ.604 కోట్ల నుంచి రూ.106 కోట్లకు కుదించడం దారుణమన్నారు. పెద్దలకు రాయితీలను అందిస్తూ సామాన్యులకిచ్చే సబ్సిడీల్లో కోత విధించిందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నాగేంద్ర కుమార్, గోపాల్, వెంకటనారాయణ, ప్రకాష్, రమేష్, నూరుల్లా, బాలకృష్ణ, నాగప్ప, వలి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, డీవైఎఫ్ఐ నాయకులు ఆంజినేయులు, సూర్యచంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆధిపత్య పోరులో అధికార పార్టీ నేతలు
– సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజం అనంతపురం అర్బన్ : జిల్లాలో ప్రజలు సమస్యల సుడిలో కొట్టు మిట్టాడుతుంటే... పరిష్కరించాల్సిన అదికార పార్టీ నేతలు ఆధిపత్య పోరులో ముగినిపోయారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజమెత్తారు. గురువారం ఆ పార్టీ కార్యాలయం గణేనాయక్ భవన్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో రాంభూపాల్ మాట్లాడారు. జిల్లాలో తీవ్ర కరువు నెలకొంది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నోట్ట రద్దు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఇళ్ల స్థలాల సమస్య, ఉపాధి కూలీలకు, మరుగుదొడ్ల నిర్మాణానికి బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. పంట నష్టపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందలేదు. రోడ్ల విస్తరణ ఆందోళన. ఇలా పలు సమస్యలతో జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికార పార్టీ నాయకులకు ఇవేవి పట్టలేదని ఆయన విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని, వారి సమస్యలను గాలికొదిలేసి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, కమిటీ సభ్యులు బీహెచ్‌రాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకే ఇక్కట్లు
– ఆంధ్రా బ్యాంకు ఎదుట ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ అనంతపురం అగ్రికల్చర్ : నల్లధనం నిర్మూలన పేరుతో పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్య వర్గాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కోర్టు రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొత్త నోట్లు పెద్ద ఎత్తున చెలామణిలోకి వచ్చే వరకు పాత నోట్లను కొనసాగించాలన్నారు. రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నా కనీస అవసరాలకు కూడా డబ్బు లభించడం లేదన్నారు. బ్యాంకుల వద్ద నిలబడి ఇప్పటివరకు 70 మంది, పనిఒత్తిడితో 11 మంది బ్యాంకు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా పార్లమెంటులో కనీసం మృతులకు సంతాపం కూడా తెలపకపోవడం దారుణమన్నారు. నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాలకు చెందిన నాయకులు ముందుగానే తెలిసిందన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 16 నుంచి 28 లోగా రూ.20.57 లక్షల కోట్లు డిపాజిట్లు చేశారని గుర్తు చేశారు. సీపీఎం నాయకులు గోపాల్, నాగేంద్రకుమార్, ఆర్వీనాయుడు, రామిరెడ్డి ,చండ్రాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
రూ.2 వేల నోట్లు ఎందుకు?
చిత్తశుద్ధి ఉంటే అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నల్లధనాన్ని వెలికితీయండి సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ గుంతకల్లు టౌన్ : పెద్ద నోట్లు రద్దు చేస్తూనే రూ.2 వేల నోట్లను ఎందుకు ముద్రించారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేరులతో మాట్లాడారు. మోదీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొనసాగుతున్న అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు దాచుకున్న నల్లధనాన్ని వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు సాహోసపేతమైన నిర్ణయమని బీజేపీ నేతలు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ ఏడుసార్లు పెద్ద నోట్ల రద్దు జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. మోదీకి అనుకూలమైన ఆదానీ గ్రూప్‌కు విదేశాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు ఓ జాతీయ బ్యాంకు నుంచి రూ.6 వేల కోట్ల రుణం ఇప్పించలేదా అని ఆయన నిలదీశారు. ఓఎ¯Œన్జీసీ, కేజీబేసి¯న్ గ్యాస్‌లను అక్రమంగా అమ్ముకుని కోట్లాది రూపాయలను రిలయ¯Œ్స కంపెనీ దోచేసిందని కాగ్ తన నివేదికలో పేర్కొందన్నారు. ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోని పెద్దమనుషులు అవినీతిని నిర్మూలిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నీతి, నిజాయితీ కలిగిన నేత అయితే గుంటూరులో జరిగిన సమావేశంలో ఆయా పార్టీ ఎమ్మెల్యేలకు షీల్డ్ కవర్లల్లో ఏం ఇచ్చారో చెప్పాలన్నారు. టీడీపీకి అనుకూలమైన పత్రికలే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిపై వరుస కథనాలు ప్రచురించాడాన్ని బట్టి అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోందన్నారు. సీపీఎం డివిజ¯ŒS కార్యదర్శి డి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి భజంత్రీ శీనా, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. -
శ్రామిక రాజ్యంతోనే దోపిడీకి అంతం
కష్టాల విముక్తికి సోషలిజమే పరిష్కారం సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ అనంతపురం అర్బన్ : దోపిడీ అంతం కావాలంటే శ్రామికుల రాజ్యం రావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ అన్నారు. కష్టాల నుంచి విముక్తి పొందేందుకు సోషలిజాన్ని స్థాపించడమే పరిష్కార మార్గమన్నారు. రష్యా విప్లవం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక హెచ్ఎల్సీ వద్దనున్న మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సంఘం కార్యాలయంలో నగర కమిటీ కార్యదర్శి నాగేంద్రకుమార్ అధ్యక్షతన విప్లవ వార్షికోత్సవ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాంభూపాల్ మాట్లాడుతూ రష్యన్ ప్రజలు 75 ఏళ్లలో పెట్టుబడిదారీ వ్యవస్థకు భిన్నంగా సామ్రాజ్యవాదాన్ని అమలు చేసి నిరుద్యోగం, పేదరికం, అసమానతలు లేని వ్యవస్థను నిర్మించుకున్నారన్నారు. ప్రజలపై ఎటువంటి భారాలు, ధరల ప్రభావం లేకుండా విద్య, వైద్యం, పిల్లల సంరక్షణ బాధ్యతలను అక్కడి ప్రభుత్వమే తీసుకుందన్నారు. భారత దేశ స్వాతంత్య్రానికి కూడా రష్యా విప్లవం స్ఫూర్తిగా నిలిచిందన్నారు. సోషలిజంతోనే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, సీపీఎం నాయకులు బీహెచ్‌రాయుడు, గోపాల్, నాగరాజు, ముర్తుజా, ప్రకాశ్, బాబు, వలి, డీఐఎఫ్ఐ నాయకులు బాలకృష్ణ, నూరుల్లా, ఏఐఎస్ఎఫ్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కరువు జిల్లాగా ప్రకటిస్తే సరిపోదు
ఎకరానికి రూ.20 వేలు పరిహారం చెల్లించాలి సీపీఎం నాయకుల మండిపాటు ధర్మవరం రూరల్ : కరువు జిల్లాగా ప్రకటిస్తే సరిపోదు..నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 2013–14లో 800 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని పంపిణీకి జీవో జారీ అమలు చేయలేదన్నారు. 2015–16లో కరువు మండలాలుగా ప్రకటించి, రూపాయి కూడా పంపిణీ చేయకపోగా కనీసం ప్రతి పాదనలు కూడా పంపలేదన్నారు. రైతులను ఆదుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఫ్లెక్సీల కోసం వాదులాడుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రకతి వల్ల రైతులకు కష్టాలు రాలేదని, కేవలం ప్రభుత్వ వైఫల్యంతోనే వారు కష్టనష్టాలకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పోలా రామాంజనేయులు, ఎస్‌హెచ్ బాషా, జంగాలపల్లి పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోట్లల్లో పంటల నష్టం
అనంతపురం అర్బన్ : జిల్లాలో వరి, మిరప, పత్తి పంటలు సాగు చేసిన రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారని, ప్రభుత్వం వీరికి తక్షణం పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. హెచ్ఎల్సీ ఆయకట్టు కింద 14 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మిరప, పత్తి పంటను రైతులు సాగు చేశారన్నారు. నీటిని అందించకపోవడంతో పంటలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. తుంగభద్రలో నీటి లభ్యత గురించి రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. నీరు పూర్తిగా అడుగంటిన తరువాత ఆఫ్–ఆన్ పద్ధతి ద్వారా రైతులను ఆదుకుంటున్నట్లు ప్రభుత్వం హడావుడి చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం వరి పంట వెన్నుదశలో ఉండగా నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయిందన్నారు. దీంతో పంట చేతికి రాకపోగా రైతులపై అప్పుల భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
778 మంది సీపీఎం నాయకుల అరెస్టు
అనంతపురం అర్బన్ : ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనని నిరసిస్తూ ప్రత్యేక హోదా ఇవాలనే డిమాండ్‌తో శనివారం నిర్వహించిన జిల్లా బంద్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో 778 మంది సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్న ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేసేందుకు సిద్ధపడిందన్నారు. అందులో భాగంగా పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాలరాచి అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
‘వెంకయ్యా... మాటల గారడీ కట్టిపెట్టు’
అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాటల గారడీ కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ... ఏపీకి 10 సంవత్సరాల పాటు ప్రత్యేకహోదా హామీ తనవల్లే వచ్చిందని గతంలో వెంకయ్యనాయుడు చెప్పిన మాటలను గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మాటల గారడీతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. అనంతపురం జిల్లాలో రూ.900 కోట్లతో బెల్ పరిశ్రమ, రూ.500 కోట్లతో కస్టమ్స్ అకాడమీ స్థాపించినట్లు గొప్పగా చెబుతున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం దారుణమన్నారు. 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను జిల్లాలో ప్రారంభించినట్లు చెబుతున్న ఆయనకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించలేదనే విషయం తెలీదా..? అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూనే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలన్నారు. -
పంట ఎండిన విషయం తెలీదనడం విడ్డూరం
అనంతపురం అర్బన్: కంప్యూటర్ మీట నొక్కితే రాష్ట్రంలో ఏ మూలు ఏమి జరిగినా తనకు తెలుస్తుందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చం ద్రబాబుకి జిల్లాలో వేరుశనగ ఎండి న విషయం తెలియదని అనడం విడ్డూరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఎద్దేవా చేశారు. విషయం తనకు చెప్పలేదంటూ ఇప్పుడు తప్పుని అధికారులపైకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్పతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు చెప్పాల్సింది మాటలు కాదు...పంట ఎండింది. రైతు నష్టపోయాడు. దీనికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతే తప్ప ఇక్కడే ఉం టా... మండలానికి ఒక ఐఏఎస్ అధికారిని పంపితే వారు వచ్చి చేసేదేముంది... ఇప్పటి వ రకు సీఎం చుట్టూ అధికారులు తిరిగి పంట నష్టపోయేలా చేశారు. ఇప్పుడు ఐఏఎస్‌లు వస్తే వారి చు ట్టూ సిబ్బంది తిరగాలే తప్ప పంటకు ఏమిటి ఉపయోగం.’’ అని ఘాటుగా ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణం ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేక పోతే వామపక్ష, ప్రతిపక్ష పార్టీలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. -
‘అనంత’పై పాలకులు దగా
- సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజం అనంతపురం అర్బన్ : వెనుబడిన అనంతపురం జిల్లాను కేంద్రం మోసం చేస్తే, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మరింత దగా చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో కార్యవర్గ సభ్యులు బీహెచ్ రాయుడుతో కలిసి విలేకరులతో రాంభూపాల్ మాట్లాడారు. జిల్లాకు 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున రెండేళ్లకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ నిధులతో జిల్లాలో 1,792 అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరు చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు ఇందులో ప్రారంభించింది కేవలం రూ.2.39 కోట్లకు సంబంధించి 33 పనులేనన్నారు. ఇవి కూడా పూర్తి కాలేదని, వీటి కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.18 లక్షలు మాత్రమే అన్నారు. ప్యాకేజీ కింద విడుదలైన రూ.100 కోట్లను రెండేళ్లయినా ఖర్చు చేయకపోవడం చూస్తే ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని ఎంతలా నిర్లక్ష్యం చేస్తోందో అర్థమవుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయించడం చేతకాని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లి ప్రత్యేక ప్యాకేజీ అడుతారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.