పంట ఎండిన విషయం తెలీదనడం విడ్డూరం
అనంతపురం అర్బన్: కంప్యూటర్ మీట నొక్కితే రాష్ట్రంలో ఏ మూలు ఏమి జరిగినా తనకు తెలుస్తుందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చం ద్రబాబుకి జిల్లాలో వేరుశనగ ఎండి న విషయం తెలియదని అనడం విడ్డూరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఎద్దేవా చేశారు. విషయం తనకు చెప్పలేదంటూ ఇప్పుడు తప్పుని అధికారులపైకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్పతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు చెప్పాల్సింది మాటలు కాదు...పంట ఎండింది. రైతు నష్టపోయాడు. దీనికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతే తప్ప ఇక్కడే ఉం టా... మండలానికి ఒక ఐఏఎస్ అధికారిని పంపితే వారు వచ్చి చేసేదేముంది... ఇప్పటి వ రకు సీఎం చుట్టూ అధికారులు తిరిగి పంట నష్టపోయేలా చేశారు. ఇప్పుడు ఐఏఎస్‌లు వస్తే వారి చు ట్టూ సిబ్బంది తిరగాలే తప్ప పంటకు ఏమిటి ఉపయోగం.’’ అని ఘాటుగా ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణం ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేక పోతే వామపక్ష, ప్రతిపక్ష పార్టీలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.