- సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజం
అనంతపురం అర్బన్ : వెనుబడిన అనంతపురం జిల్లాను కేంద్రం మోసం చేస్తే, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మరింత దగా చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో కార్యవర్గ సభ్యులు బీహెచ్ రాయుడుతో కలిసి విలేకరులతో రాంభూపాల్ మాట్లాడారు. జిల్లాకు 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున రెండేళ్లకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ నిధులతో జిల్లాలో 1,792 అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరు చేశారన్నారు.
అయితే ఇప్పటి వరకు ఇందులో ప్రారంభించింది కేవలం రూ.2.39 కోట్లకు సంబంధించి 33 పనులేనన్నారు. ఇవి కూడా పూర్తి కాలేదని, వీటి కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.18 లక్షలు మాత్రమే అన్నారు. ప్యాకేజీ కింద విడుదలైన రూ.100 కోట్లను రెండేళ్లయినా ఖర్చు చేయకపోవడం చూస్తే ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని ఎంతలా నిర్లక్ష్యం చేస్తోందో అర్థమవుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయించడం చేతకాని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లి ప్రత్యేక ప్యాకేజీ అడుతారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
‘అనంత’పై పాలకులు దగా
Published Fri, Aug 26 2016 10:52 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
Advertisement