కరువు జిల్లాగా ప్రకటిస్తే సరిపోదు..నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు.
ఎకరానికి రూ.20 వేలు పరిహారం చెల్లించాలి
సీపీఎం నాయకుల మండిపాటు
ధర్మవరం రూరల్ : కరువు జిల్లాగా ప్రకటిస్తే సరిపోదు..నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 2013–14లో 800 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీకి జీవో జారీ అమలు చేయలేదన్నారు. 2015–16లో కరువు మండలాలుగా ప్రకటించి, రూపాయి కూడా పంపిణీ చేయకపోగా కనీసం ప్రతి పాదనలు కూడా పంపలేదన్నారు.
రైతులను ఆదుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఫ్లెక్సీల కోసం వాదులాడుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రకతి వల్ల రైతులకు కష్టాలు రాలేదని, కేవలం ప్రభుత్వ వైఫల్యంతోనే వారు కష్టనష్టాలకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పోలా రామాంజనేయులు, ఎస్‌హెచ్ బాషా, జంగాలపల్లి పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు.