అనంతపురం అర్బన్ : ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనని నిరసిస్తూ ప్రత్యేక హోదా ఇవాలనే డిమాండ్‌తో శనివారం నిర్వహించిన జిల్లా బంద్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో 778 మంది సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్న ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేసేందుకు సిద్ధపడిందన్నారు. అందులో భాగంగా పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాలరాచి అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
778 మంది సీపీఎం నాయకుల అరెస్టు
Published Sun, Sep 11 2016 12:16 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
Advertisement
Advertisement