ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిటీబ్యూరో: న్యూమోనియాను కట్టడి చేసేందుకు త్వరలో న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్(పీసీవీ)ను హైదరాబాద్ జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన టాస్క్‌ఫోర్సు సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యుమోనియా తీవ్ర శ్వాసకోశ సంక్రమణ వ్యాధి అని, జ్వరం, చెవినొప్పి, చెవి నుంచి స్రావం, ముక్కు నుంచి నిరంతరం స్రావం, తలనొప్పి, వేగంగా శ్వాసించడం వంటి రుగ్మతలు కలుగుతాయన్నారు. దీని నుంచి పిల్లలను రక్షించడానికి సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పీసీవీ వ్యాక్సిన్‌ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు.
♦ చిన్న పిల్లలకు మొదటి డోసు ఆరు వారాలకు, రెండో డోసు 14 వారాల వయసుగల వారికి, 9 నెలల వయసులో మూడవ డోసు ఇస్తారని తెలిపారు.
♦ ఇది చాలా ఖరీదైన వ్యాక్సిన్ అని, ప్రైవేటు ఆసుపత్రుల్లో ధర రూ.3 వేల వరకు ఉంటుందన్నారు.
♦ ప్రభుత్వం దీన్ని ఉచితంగా పంపిణీ చేస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
♦ ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడి, ఇతర ఆరోగ్య సిబ్బందికి శిక్షణ త్వర లో పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్య క్రమంలో డాక్టర్ పద్మజ, ఎస్‌పీహెచ్‌లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment