Pneumonia vaccine
-
World Pneumonia Day: చిన్నారుల మరణాలకు కారణంగా నిలుస్తూ..
ఈరోజు (నవంబర్ 12) ప్రపంచ న్యుమోనియా దినోత్సవం. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు కారణంగా నిలుస్తూ, అన్ని వయసులవారినీ ప్రభావితం చేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య న్యుమోనియా. ఈ వ్యాధిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రపంచ న్యుమోనియా దినోత్సవం నిర్వహిస్తున్నారు.న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఇది సోకుతుంది. న్యుమోనియాను ప్లూరిసీ అని కూడా అంటారు. పిల్లలు లేదా వృద్ధులు ఎవరికైనా ఈ వ్యాధి సొకే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపిన వివరాల ప్రకారం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 7,40,000 మంది ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో మృత్యువాత పడ్డారు.న్యుమోనియా వ్యాధి ముప్పును తగ్గించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చైల్డ్ న్యుమోనియాకు వ్యతిరేకంగా, ఈ వ్యాధిని నియంత్రించే దిశగా జరిగే ప్రచార కార్యక్రమంలో వందకుపైగా సంస్థలు పాల్గొంటున్నాయి. స్టాప్ న్యుమోనియా సంస్థ అంచనా ప్రకారం 2009లో 6,72,000 మంది పిల్లలు సహా దాదాపు 2.5 మిలియన్ల మంది న్యుమోనియా బారినపడి మరణించారు.ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని 2009, నవంబర్ 12న గ్లోబల్ కోయలిషన్ ప్రారంభించింది. 2030 నాటికి న్యుమోనియా మరణాల సంఖ్యను సున్నాకి తగ్గించడమే ఈ దినోత్సవ లక్ష్యం. న్యుమోనియా చికిత్స అందించగల వ్యాధి. అయితే ఈ వ్యాధి విషయంలో అధిక మరణాల రేటు నమోదవుతోంది. ఈ ప్రాణాంతక శ్వాసకోశ రుగ్మతపై పోరాడటం, పిల్లలు, పెద్దలలో మరణాల రేటును తగ్గించడం అత్యవసరమని వైద్య నిపుణులు గుర్తించారు. న్యుమోనియా కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంటుంది. అందుకే దీనిని తొలి దశలోనే గుర్తించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో న్యుమోనియాను తేలిగ్గా గుర్తించొచ్చు. చిన్నారుల్లో ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే పెద్దలు అప్రమత్తం కావాలి. ఊపిరితిత్తుల్లోని ఈ వైరస్ శరీరమంతటా వ్యాపించడానికి రోజుల నుంచి వారాల వరకు పట్టవచ్చు. బ్యాక్టీరియా కారణంగా సోకే న్యుమోనియాకు యాంటీబయోటిక్స్ ద్వారా చికిత్స అందించవచ్చు. న్యుమోనియా తీవ్రం అయినప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరాలి. అధికంగా విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం లాంటి ఉపశమన చర్యలతో న్యుమోనియా నుంచి త్వరగా కోలుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు... -
ఏటా 8.50 లక్షల మంది చిన్నారులకు రక్ష
సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు చిన్నారులకు వచ్చే అత్యంత ప్రమాదకరమైన న్యూమోనియా వ్యాధి నిరోధానికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మొదలైంది. బుధవారం సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం నుంచి అన్ని జిల్లాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే ఆరోగ్య ఉపకేంద్రాలన్నిటిలోనూ ఈ వ్యాక్సిన్ లభ్యమవుతుంది. ఏటా 8.50 లక్షల మంది చిన్నారులకు న్యూమోనియా నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణనిస్తుంది. పీసీవీ (న్యూమోకాకల్ వ్యాక్సిన్) పేరుతో ఇచ్చే ఈ టీకా..నెలన్నర వయసులో మొదటి డోసు, మూడున్నర మాసాల్లో రెండో డోసు, తొమ్మిది నెలలు పూర్తయ్యే లోపు మూడో డోసు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 17 శాతం మంది శిశువులు న్యూమోనియాతోనే మృతి చెందుతున్నారు. కేంద్రం ఈ వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే ఆరు రాష్ట్రాలకు పంపించగా.. తాజాగా మన రాష్ట్రానికి పంపిణీ చేసింది. ఇప్పటికే 11 రకాల వ్యాధి నిరోధక టీకాలు రాష్ట్రంలో వేస్తుండగా, న్యూమోనియా వ్యాక్సిన్ 12వదిగా నమోదైంది. కాగా, ఈ ఏడాది మన ఏపీలో మొదటి డోసు 5.45 లక్షల మందికి, రెండో డోసు 4.09 లక్షల మందికి, మూడో డోసు (బూస్టర్ డోసు), 68,188 మందికి వేయనున్నారని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వివరించారు. -
సీఎం జగన్ సమక్షంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్‌ను వైద్యారోగ్యశాఖ అధికారులు బుధవారం ప్రారంభించారు. సీఎం జగన్ సమక్షంలో వైద్యాధికారులు నెలల చిన్నారికి పీసీవీ వ్యాక్సిన్‌ను వేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మంత్రుల సమక్షంలో అన్ని జిల్లాలలో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. కాగా న్యూమోనియా వ్యాధితో రెండేళ్ల లోపు చిన్నారుల ఎక్కువగా మృతి చెందుతున్న నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన న్యూమో కాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ తో శిశుమరణాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రతీ చిన్నారికి మూడు డోసుల టీకా ఇవ్వనున్నారు. ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా చిన్నారులకి వ్యాక్సిన్ వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఆరు వారాలు నిండిన 5,45,506 మంది చిన్నారులకి ఈ ఏడాది న్యూమోనియా తొలి డోసు వేయనున్నారు. ఇక 14 వారాలు నిండిన 4,09,130 మంది చిన్నారులకి రెండవ డోసు....తొమ్మిది నెలల నిండిన 68,188 మంది చిన్నారులకి బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది రకాల వ్యాక్సిన్లను ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా కొత్తగా ఇస్తున్న న్యుమోకాకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ -
‘న్యూ మోకోకాల్’ వ్యాక్సిన్.. పిల్లలకు వేయించారా?!
బంజారాహిల్స్: వర్షాకాలం, శీతాకాలంలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా న్యుమోనియాతో బాధపడుతుంటారు. చిన్నారులు శ్వాస ఆడక విలవిల్లాడుతుంటారు.. ఇలాంటి వారికి సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. పిల్లల్లో శ్వాసకోశ సమస్యల నివారణకు న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధమయ్యారు. 0–5 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయనున్నారు. ప్రస్తుతం ఈ టీకా ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే లభ్యమవుతోంది. ఒక్కో డోసు ఖరీదు రూ.2,800 నుంచి రూ.3,800 వరకు ఉంటుంది. ఈ టీకా పంపిణీలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రెహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్, వెంగళరావునగర్, అమీర్‌పేట డివిజన్ల పరిధిలోని 11 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ డివిజన్లలో 28వేల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18 నుంచి టీకా ప్రక్రియను అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రారంభించనున్నారు. చదవండి: హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్, సామూహిక అత్యాచారం వ్యాధుల కట్టడికి.. న్యుమోకాకల్ అనేది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల సమూహం. వీటిని అధిగమించడానికి ఈ టీకా వేస్తారు. పిల్లల్లో అంటు వ్యాధులు సోకకుండా ఇది అడ్డుకుంటుంది. న్యుమోనియా మెనింజిటిస్ వంటి వ్యాధుల వ్యాప్తిని కట్టడి చేస్తుంది. పీసీవీ గురించి ఇప్పటికే ఆయా ఆరోగ్య కేంద్రాల నర్సులు, వైద్యాధికారులు, ఆశ వర్కర్లు విస్తృత ప్రచారం చేపట్టారు. పీహెచ్‌సీల వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. పీహెచ్సీ వైద్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేస్తారు. టీకాల కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలస్యమైతే నష్టమే.. శిశువు పుట్టిన ఏడాదిలోగా తప్పనిసరి టీకా ఇ వ్వాల్సి ఉంటుంది. ప్రతి డోస్లోనూ 0.5 మి.లీ. మోతాదు వ్యాక్సిన్ ఇస్తారు. ఒకవేళ ఆలస్యమైతే మొదటి పుట్టిన రోజుకు ముందు కనీసం ఒక మో తాదు పీసీవీ వేసి ఉంటే మిగతా వాటిని ఇవ్వొచ్చు. పుట్టిన మొదటి సంవత్సరంలోనే ఆలస్యమైతే కనిష్టంగా 8 వారాల వ్యవధిలో వేరు చేసి తదుపరి డోసు షెడ్యూల్ ఇమ్యునైజేషన్ సందర్శనలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వందశాతం సురక్షితం. తల్లిపాలు, పోషకాహారం లేని పిల్లలకు ఈ వ్యాధి అధికంగా సోకే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఉచితంగా అందించే టీకాను సద్వినియోగం చేసుకోవాలి. చిన్నారులకు టీకాలు అందేలా అధికారులు చొరవ చూపుతున్నారు. ఆరు వారాల వయసులో మొదటి డోసు, 14 వారాల వయసులో రెండో డోసు, 9 నెలల్లో బూస్టర్ డోసును చిన్నారులకు వేస్తారు. తల్లిదండ్రుల్లో అవగాహన అవసరం పీసీవీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతోంది. పిల్లలకు రొటీన్‌గా ఇస్తున్న టీకాలకు ఇది అదనం. 0–5 ఏళ్లలోపు పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ కల్పిస్తుంది. పిల్లలకు పీసీవీ ఇప్పించడంలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. అందుకే వారికి అవగాహన క లిగించాం. నెలన్నర క్రితం పుట్టిన పిల్లలను పీసీవీ వే యడానికి పరిగణలోకి తీసుకుంటాం. ఈ వ్యాక్సిన్ తీ సుకున్న పిల్లలకు ఐదేళ్ల వరకు న్యుమోనియా రాదు. రక్తహీతన నివారణకు కూడా దోహదపడుతుంది. – డాక్టర్ షీమా రెహమాన్, వైద్యాధికారిణి, బంజారాహిల్స్ యూపీహెచ్సీ అన్ని ప్రభుత్వ సెంటర్లలో.. ఏడాదిలోపు చిన్నారుల్లో న్యూ మోనియా వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘న్యూ మోకోకాల్’ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను అన్ని యూపీహెచ్సీ సెంటర్లలో నేటినుంచి పంపిణీ చేస్తున్నారు. 80శాతం మంది పిల్లల్లో ‘స్ప్రెక్టోకోకస్’ అనే బాక్టిరియా కారణంగా న్యూమోనియా సోకుతుంది. దీన్ని నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సిన్‌ను ఇస్తారు. – డాక్టర్ దీప్తి ప్రియాంక మంచాల, మెడికల్ ఆఫీసర్, బొగ్గులకుంట యూపీహెచ్సీ సెంటర్ -
రూ. 3 వేల న్యుమోనియా వ్యాక్సిన్ ఉచితంగా
సాక్షి, సిటీబ్యూరో: న్యూమోనియాను కట్టడి చేసేందుకు త్వరలో న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్(పీసీవీ)ను హైదరాబాద్ జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన టాస్క్ఫోర్సు సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యుమోనియా తీవ్ర శ్వాసకోశ సంక్రమణ వ్యాధి అని, జ్వరం, చెవినొప్పి, చెవి నుంచి స్రావం, ముక్కు నుంచి నిరంతరం స్రావం, తలనొప్పి, వేగంగా శ్వాసించడం వంటి రుగ్మతలు కలుగుతాయన్నారు. దీని నుంచి పిల్లలను రక్షించడానికి సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పీసీవీ వ్యాక్సిన్‌ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ♦ చిన్న పిల్లలకు మొదటి డోసు ఆరు వారాలకు, రెండో డోసు 14 వారాల వయసుగల వారికి, 9 నెలల వయసులో మూడవ డోసు ఇస్తారని తెలిపారు. ♦ ఇది చాలా ఖరీదైన వ్యాక్సిన్ అని, ప్రైవేటు ఆసుపత్రుల్లో ధర రూ.3 వేల వరకు ఉంటుందన్నారు. ♦ ప్రభుత్వం దీన్ని ఉచితంగా పంపిణీ చేస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ♦ ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎఎన్ఎంలు, అంగన్వాడి, ఇతర ఆరోగ్య సిబ్బందికి శిక్షణ త్వర లో పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్య క్రమంలో డాక్టర్ పద్మజ, ఎస్పీహెచ్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
న్యుమోనియా టీకా వచ్చేస్తోంది!
సాక్షి, అమరావతి: అత్యంత ప్రమాదకరమైన న్యుమోనియా వ్యాధిని నియంత్రించే పీసీవీ (న్యూమో కాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్) టీకా ఇక మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఈ న్యుమోకాకల్ వ్యాక్సిన్ వేస్తునారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ వేయనున్నారు. 2017లోనే ఇది మన దేశంలోకి వచ్చినా.. ఖరీదైనది కావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో దీనిని ఉచితంగా వేయనున్నారు. తొమ్మిది నెలల్లోగా మూడు డోసులు బిడ్డకు తొమ్మిది నెలలు వయసు వచ్చేలోగా మూడు డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది. పుట్టిన ఆరు వారాల వయసులో ఒక డోసు, 14 వారాల వయసులో రెండోది వేయించుకోవాలి. చివరిగా మూడో డోసు తొమ్మిది నెలల వయసులోగా వేయించుకోవాలి. మూడు డోసులు పూర్తయితే న్యుమోనియా నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చునని వైద్యులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఏటా 8.90 లక్షల మంది శిశువులు పుడుతున్నట్లు అంచనా. ఇప్పుడు వీళ్లందరికీ ఈ టీకా గొప్ప ఊరటనిస్తుంది. డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్ట్‌లకు శిక్షణ ఈనెల 20 తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది. వివిధ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లుగానే న్యూమో కాకల్ వ్యాక్సిన్‌ను కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం వారం రోజులుగా మెడికల్ ఆఫీసర్లకు, ఏఎన్ఎంలకు, ఫార్మసిస్ట్‌లకు శిక్షణనిస్తున్నారు. ఈనెల 15 నాటికి శిక్షణ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత వ్యాక్సిన్ తేదీని ఖరారుచేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ వ్యాక్సిన్ వేస్తున్న కారణంగా ఇప్పటికే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లుచేశారు. ప్రతి ఐదుగురిలో ఒకరు న్యుమోనియాతో.. నిజానికి.. శిశు మరణాల్లో ప్రీమెచ్యూర్ లేదా బరువు తక్కువగా ఉన్న చిన్నారుల సంఖ్య ఎక్కువ. మొత్తం మృతుల్లో 29.8 శాతం వీళ్లే. ఆ తర్వాత రాష్ట్రంలో మృతిచెందుతున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు న్యుమోనియాతో మృత్యువాత పడుతున్నారు. వీరి శాతం 17.1. చిన్నారుల మృతికి రెండో అతిపెద్ద కారణం ఇదే.తిక డయేరియా కారణంగా 8.6 శాతం మంది మృతిచెందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11రకాల వ్యాధి నిరోధక టీకాలు వేస్తుండగా, పీసీవీ వ్యాక్సిన్‌తో అది 12కు పెరుగుతుంది. సీఎం చేతుల మీదుగా శ్రీకారం వ్యాక్సిన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి సిబ్బందికి వ్యాక్సిన్ ఎలా వేయాలో శిక్షణనిచ్చాం. త్వరలోనే సీఎం వైఎస్ జగన్ నిర్ణయం మేరకు తేదీని ఖరారుచేసి ఆయన చేతుల మీదుగా వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తాం. న్యుమోనియా నుంచి కాపాడే గొప్ప వ్యాధి నిరోధక టీకా ఇది. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
'న్యుమోనియాకు' చెక్
సాక్షి, అమరావతి: దేశంలో న్యుమోనియాతో జరుగుతున్న చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట పడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు సుమారు 70 వేలమంది మృతి చెందుతుండగా.. అందులో 17.1 శాతం న్యుమోనియాతోనే మరణిస్తున్నట్లు అంచనా. ఎన్నో వ్యాధులకు టీకాలు వచ్చినా దీనికి సంబంధించిన టీకా ఖరీదైనది కావడంతో వేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులనుంచి దేశం గట్టెక్కింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ న్యుమోనియా టీకాను ‘న్యుమోసిల్’ పేరుతో ప్రవేశపెట్టింది. అన్ని పరీక్షలు పూర్తయిన ఈ వ్యాక్సిన్‌ను వారం రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం దేశానికి పరిచయం చేసింది. దీంతో చిన్నారుల మృతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో బాధపడుతూ మృతిచెందుతున్న ఘటనలు కోకొల్లలు. టీకాను ఉత్పత్తి చేయడమే కాకుండా తక్కువ ధరకు అందుబాటులోకి తేవడంతో ఇకపై దిగువ మధ్యతరగతి వారు కూడా ఈ టీకాను తమ పిల్లలకు వేయించే అవకాశం ఉంటుంది. ఈ టీకా చిన్నారుల ప్రాణరక్షణకు అండగా ఉంటుందని భావిస్తున్నారు. న్యుమోనియాతో భారీగా నష్టం దేశంలో ప్రతి వెయ్యిమంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో 37 మంది మృతి చెందుతున్నారు. వీరిలో 17.1 శాతం మంది మరణానికి న్యుమోనియా కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35 మంది మృతిచెందుతున్నారు. వీరిలో 17 శాతం మంది న్యుమోనియా కారణంగానే చనిపోతున్నారు. వారం రోజుల కిందటే దేశానికి పరిచయమైన ఈ టీకాను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బిల్ అండ్ మిలిండా గేట్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీన్ని పీసీవీ (న్యుమోనికల్ కాంజుగేట్ వ్యాక్సిన్) అంటారు. తొలుత ఈ వ్యాక్సిన్‌ను న్యుమోనియా మృతులు ఎక్కువగా ఉన్న బిహార్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (17 జిల్లాల్లో), హరియాణా రాష్ట్రాల్లో వేస్తారు. తర్వాత మిగతా రాష్ట్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి రూ.250కి, ప్రైవేటు వ్యక్తులకైతే రూ.700కు ఇస్తున్నారు. కొద్దిగా సమయం పడుతుంది కొత్తగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. రెండు మూడు నెలల్లో మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం. ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ వ్యాక్సిన్ డోసు ఇలా - బిడ్డ పుట్టిన 6 వారాల్లోగా తొలిడోసు. - 14 వారాల్లోగా రెండోడోసు. - 9 నెలల నుంచి 12 నెలల మధ్య వయసులో బూస్టర్ డోసు. -
కొత్తగా న్యూమోకోకల్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: చిన్నారుల్లో శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు న్యుమోనియాను ఆరికట్టడానికి వీలుగా కేంద్రం సరికొత్త టీకాను అందుబాటులోకి తెచ్చింది. సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమంలో(యూఐపీ) భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శనివారం న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ)ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని 21 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్‌ను అందిస్తామన్నారు. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో..అనంతరం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామన్నారు. ప్రజల్లో పీసీవీపై చైతన్యం పెంపొందించడానికి పోస్టర్లు, బ్యానర్లతో సహా టీవీ, రేడియోలలో ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను నడ్డా ఆవిష్కరించారు.