కొత్తగా న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌ | Pneumococcal vaccine | Sakshi
Sakshi News home page

కొత్తగా న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌

Published Sun, May 14 2017 2:24 AM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

Pneumococcal vaccine

న్యూఢిల్లీ: చిన్నారుల్లో శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు న్యుమోనియాను ఆరికట్టడానికి వీలుగా కేంద్రం సరికొత్త టీకాను అందుబాటులోకి తెచ్చింది. సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమంలో(యూఐపీ) భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శనివారం న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌(పీసీవీ)ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో హిమాచల్‌ ప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని 21 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్‌ను అందిస్తామన్నారు. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో..అనంతరం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామన్నారు. ప్రజల్లో పీసీవీపై చైతన్యం పెంపొందించడానికి పోస్టర్లు, బ్యానర్లతో సహా టీవీ, రేడియోలలో ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను నడ్డా ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement