newborns
-
Israel-Hamas War: అదే గాజా.. అదే దీన గాథ!
దెయిర్ అల్ బలాహా/ఖాన్ యూనిస్ (గాజా): అదే కల్లోలం. అవే దారుణ దృశ్యాలు. అందరి కంటా నిస్సహాయంగా నీటి ధారలు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల ధాటికి గాజాలో మానవీయ సంక్షోభం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఎటు చూసినా మరణమృదంగం ప్రతిధ్వనిస్తోంది. గాజాలోని దాదాపు అన్ని ఆస్పత్రులనూ ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టి రోజుల తరబడి దిగ్బంధించడం తెలిసిందే. దాంతో కరెంటుతో పాటు కనీస సౌకర్యాలన్నీ దూరమై అవి నరకం చవిచూస్తున్నాయి. ఐసీయూలు, ఇంక్యుబేటర్లకు కూడా కరెంటు, ఆక్సిజన్ రోజులు దాటింది. వాటిల్లోని రోగులు, నవజాత శిశువులు నిస్సహాయంగా మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు! ఇప్పటిదాకా అరచేతులు అడ్డుపెట్టి అతి కష్టమ్మీద వారి ప్రాణాలు నిలుపుతూ వచ్చిన వైద్యులు కూడా క్రమంగా చేతులెత్తేస్తున్నారు. గాజాలో అతి పెద్దదైన అల్ షిఫాతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి! షిఫా ఇంకెంతమాత్రమూ ఆస్పత్రిగా మిగల్లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోం గేబ్రెయేసస్ వాపోయారు. ‘‘ఈ దారుణంపై ప్రపంచం మౌనం వీడాల్సిన సమయమిది. కాల్పుల విరమణ తక్షణావసరం’’ అని పిలుపునిచ్చారు. చిన్నారులను కాపాడేందుకు... ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నవజాత శిశువులను కాపాడుకునేందుకు అల్ షిఫా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా తదితరాలన్నీ నిలిచిపోవడంతో చిన్నారులను ఇంక్యుబేటర్ల నుంచి తీసుకెళ్లి సిల్వర్ ఫాయిల్ తదితరాల్లో చుట్టబెట్టిన మంచాలపై ఒక్కచోటే పడుకోబెడుతున్నారు. పక్కన వేడినీటిని ఉంచి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంధన రగడ ఇంక్యుబేటర్లను నడిపి చిన్నారులను కాపాడేందుకు అల్ షిఫా ఆస్పత్రికి 300 లీటర్ల ఇంధనం అందజేస్తే హమాస్ ఉగ్రవాదులు అడ్డుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. కానీ అరగంటకు కూడా చాలని ఆ సాయంతో ఏం ప్రయోజనమని పాలస్తీనా ఆరోగ్య శాఖ మండిపడింది. ఇది క్రూర పరిహాసమంటూ దుయ్యబట్టింది. అల్ రంటిసి, అల్ నస్ర్ ఉత్తర గాజాలోని ఈ ఆస్పత్రుల నుంచి రోగులు తదితరులను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారానికే కొద్దిమంది రోగులు, వైద్య సిబ్బంది మినహా ఇవి దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అయితే వాటిలో సాధారణ పౌరులు వందలాదిగా తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం వీటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని వారందరినీ అక్కడినుంచి పంపించేస్తోంది. అల్ స్వెయిదీ లోపల కొద్ది మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 500 మందికి పైగా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శనివారం నాటి రాకెట్ దాడి ఆస్పత్రిని దాదాపుగా నేలమట్టం చేసింది. ఆదివారం రాత్రికల్లా ఇజ్రాయెల్ సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారు. ఇంకా మిగిలిన ఉన్న వారందరినీ ఖాళీ చేయించి బుల్డోజర్లతో ఆస్పత్రిని నేలమట్టం చేయించారు. అల్ షిఫా 700 పడకలతో గాజాలోనే అతి పెద్ద ఆస్పత్రి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం పూర్తిస్థాయిలో చుట్టుముట్టింది. దాంతో వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. కరెంటు లేదు. ఇంధనం, ఆహార సరఫరాలు తదితరాలన్నీ నిండుకున్నాయి. ఇక్కడ తలదాచుకున్న శరణార్థుల్లో అత్యధికులు పారిపోయారు. ఇంకో 2,500 మందికి పైగా ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కానీ 20 వేలకు పైగా అక్కడ చిక్కుబడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 600 మందికి పైగా రోగులు, 500 మంది దాకా వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వందలాది శవాలు ఆస్పత్రి ప్రాంగణంలో పడున్నట్టు చెబుతున్నారు! ఆది, సోమవారాల్లోనే 35 మంది రోగులు, ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 36 మంది చిన్నారులు ఏ క్షణమైనా తుది శ్వాస విడిచేలా ఉన్నట్టు వైద్య వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. అల్ ఖుద్స్ గాజాలో రెండో అతి పెద్ద ఆస్పత్రి. 500 మందికి పైగా రోగులు, 15 వేలకు పైగా శరణార్థులున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఆదివారానికే ఆస్పత్రిలో సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆహార నిల్వలన్నీ నిండుకున్నాయి. పరిసరాల్లోనే గాక ఆస్పత్రిపైకి కూడా భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాంతో ఇక్కడి ఐసీయూ వార్డు రోగులు ఒకట్రెండు రోజుల్లో నిస్సహాయంగా మృత్యువాత పడేలా ఉన్నారు! 6,000 మందికి పైగా శరణార్థులను ఇక్కణ్నుంచి దక్షిణాదికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్ అక్సా ఇక్కడ కూడా వందల సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది, శరణార్థులున్నారు. రోగుల, ముఖ్యంగా 100 మందికి పైగా ఉన్న నవజాత శిశువుల సామూహిక మరణాలకు ఇంకెంతో సమయం పట్టదని సిబ్బంది చెబుతున్నారు. తూటాలు తరచూ ఆస్పత్రి లోనికి దూసుకొస్తున్నాయంటున్నారు. ఆస్పత్రిని సైన్యం చుట్టుముట్టింది. -
నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?
నాకు నాలుగు నెలల పాప. అంత చంటిపిల్లకు అప్పుడప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతోంది. నేను భయపడుతుంటే మా ఇంట్లో పెద్దవాళ్లేమో ‘మరేం పర్లేదు .. అలా అవడం సహజమే’ అని తేలిగ్గా తీసుకుంటున్నారు. నిజంగా పర్లేదా? అది సహజమేనా? – పేరు, ఊరు వివరాలు రాయలేదు. వైట్ కలర్ లేదా బ్లడ్ టైప్ వెజైనల్ డిశ్చార్జ్ పది రోజుల వయసు నుంచి ఆరు నెలల వయసు గల ఆడపిల్లల్లో చాలా నార్మల్. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంలో ఉండి.. పుట్టిన తరువాత ఒక్కసారిగా ఆ హార్మోన్ ప్రభావం నుంచి బయటపడ్డంతో ఇలా విత్‌డ్రాయల్ బ్లీడ్ లేదా డిశ్చార్జ్ కనపడవచ్చు. ఇది పుట్టినప్పటి నుంచి ఆరునెలల దాకా ఉండొచ్చు. మూడు నాలుగు రోజుల్లోనే తగ్గిపోతుంది. క్లియర్‌గా.. స్మెల్ లేని వైట్ డిశ్చార్జ్ ఆడపిల్లల్లో ఎప్పుడైనా కనపడొచ్చు. అయితే ఇన్ఫెక్షన్ గనుక ఉంటే రెడ్నెస్, బ్యాడ్ స్మెల్, యెల్లో లేదా గ్రీన్‌కలర్ వెజైనల్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. దగ్గు, జలుబుకు ఎక్కువసార్లు యాంటీబయాటిక్స్ వాడితే వాటితో వెజైనాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సబ్బుతో స్నానం, టాల్కంపౌడర్స్, డియోడరెంట్ పెర్ఫ్యూమ్స్ వంటివాటి వల్లా.. పిల్లల ఇన్నర్‌వేర్ నుంచీ ఇరిటేషన్ రావచ్చు. అందుకే మైల్డ్ క్లెన్సర్స్తో.. గోరువెచ్చని నీటిలో క్లీన్ చెయ్యాలి. పాపకు స్నానం చేయించాక వెట్ క్లాత్‌తో వెజైనల్ ఏరియాను ముందు నుంచి వెనుకగా తుడవాలి. ఔ్చbజ్చీ కింద డైపర్కి సంబంధించిందేమైనా ఉండిపోయి.. అది వైట్ డిశ్చార్జ్‌గా కనిపించవచ్చు. అందుకే అక్కడ శుభ్రంగా తుడవాలి. స్క్రబ్ చేయకూడదు. మెత్తటి తడి గుడ్డతోనే అదీ ముందు నుంచి వెనుకగా శుభ్రం చేయాలి. ఒక్కోసారి ఫారిన్ బాడీ ఏదైనా పొరపాటున వెజైనాలో ఉంటే కూడా తెల్లబట్ట అవుతూ ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్/ పీడియాట్రీషన్ని సంప్రదించడం మంచిది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!) -
వైరల్ వీడియో: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
-
Turkey Syria Earthquake: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
టర్కీలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. టర్కీలో సరిగ్గా అదే సమయంలో ఓ ఆస్పత్రిలోని నర్సులు మాత్రం భూకంప ప్రకంపనాలకు భయంతో పారిపోలేదు. అక్కడే ఉండి ఇంక్యుబేటర్‌లో ఉన్న నవజాత శిశువులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఇంక్యుబేటర్‌లో ఉన్న శిశువల ఉన్న గది వద్దకు త్వరిత గతిన చేరుకుని, అక్కడే ఉండి వాటిని పడిపోకుండా పట్టుకుని అలానే నుంచొని ఉన్నారు. వారు చేసిన ప్రయత్నాల కారణంగా ఆ ఇంక్యుబేటర్లు కింద పడిపోకుండా ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోని టర్కీలోని ఫాత్మా సాహిన్ అనే రాజకీయవేత్త ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా టర్కీ, సీరియాలలో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 30 వేల మందికి చేరుకున్న సంగతి తెలిసిందే. Sağlıkçılarımız şahane insanlar👏#GaziantepBüyükşehir İnayet Topçuoğlu Hastanemiz yenidoğan yoğun bakım ünitesinde, 7.7'lik #deprem esnasında minik bebekleri korumak için Hemşire Devlet Nizam ve Gazel Çalışkan tarafından gösterilen gayreti anlatacak kelime var mı? 🌹🌼💐👏👏👏 pic.twitter.com/iAtItDlOwb — Fatma Şahin (@FatmaSahin) February 11, 2023 (చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం) -
పుట్టగానే ఆధార్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: అప్పుడే పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ రానుంది. పిల్లలు జన్మించిన ఆస్పత్రుల నుంచి సమాచారం తీసుకుని.. అదే రోజున ఆధార్‌కు ఎన్రోల్ చేసేలా రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పురపాలక శాఖ జనన నమోదు పోర్టల్‌ను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)కు అనుసంధానం చేయనుంది. వారం, పదిరోజుల్లోనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారి అని పురపాలక శాఖ అధికారులు చెప్తున్నారు. జననాల పోర్టల్ నుంచి.. ఆస్పత్రులు ఆన్లైన్ ద్వారా ఏ రోజుకారోజు జననాల వివరాలను నమోదు చేస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను నిర్వహిస్తోంది. ఆస్పత్రులు శిశువు తల్లిదండ్రుల పేర్లు, ఆధార్ నంబర్లు, చిరునామా, పుట్టిన తేదీ, సమయం, లింగం, వయసు వివరాలను సేకరించి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నాయి. ఈ సమాచారాన్ని వినియోగించి.. నవజాత శిశువులకు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్‌ను కేటాయించడానికి రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు యూఐడీఏఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. జనన నమోదు ప్రక్రియ ముగిసిన వెంటనే తల్లిదండ్రుల మొబైల్ ఫోన్‌కు జనన ధ్రువీకరణ పత్రం డౌన్లోడ్ లింక్‌తోపాటు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ సైతం ఎస్సెమ్మెస్‌ల రూపంలో అందుతుందని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఆ ఎన్రోల్మెంట్ నంబర్‌తో మీసేవ కేంద్రం నుంచి ఆధార్‌కార్డును పొందడానికి వీలుంటుందని వివరించారు. పుట్టినబిడ్డలకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ కేటాయింపు ఇప్పటివరకు ఎక్కడా ప్రారంభం కాలేదని.. తొలిసారిగా రాష్ట్రంలోనే అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. నీలి రంగు ఆధార్ కార్డు యూఐడీఏఐ ఐదేళ్లలోపు పిల్లల కోసం నీలిరంగులో తాత్కాలిక ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. దీనికోసం శిశువుల బయోమెట్రిక్ డేటా సేకరించరు. పిల్లల ఫొటో, తల్లిదండ్రు ల సమాచారం, చిరునామా, మొబైల్ నంబర్ తదితర వివరాలను మీసేవ కేంద్రాలు లేదా యూఐడీఏఐ కార్యాలయాల్లో ఇవ్వొచ్చు. ఐదేళ్లు దాటాక బయోమెట్రిక్ డేటా ఇచ్చి శాశ్వత ఆధార్ కార్డును పొందాలి. 15 ఏళ్ల వ యసు తర్వాత మరోసారి బయోమెట్రిక్ డేటా ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు ఊరట.. దేశంలో చాలా సేవలు, సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు కీలకంగా మారింది. వ్యక్తిగత, చిరునామా గుర్తింపులోనూ, పాఠశాలలో ప్రవేశాలలో అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో శిశువులకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ జారీ చేయనుండటం తల్లిదండ్రులకు ఊరట కలిగించనుంది. -
రూ. 3 వేల న్యుమోనియా వ్యాక్సిన్ ఉచితంగా
సాక్షి, సిటీబ్యూరో: న్యూమోనియాను కట్టడి చేసేందుకు త్వరలో న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్(పీసీవీ)ను హైదరాబాద్ జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన టాస్క్ఫోర్సు సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యుమోనియా తీవ్ర శ్వాసకోశ సంక్రమణ వ్యాధి అని, జ్వరం, చెవినొప్పి, చెవి నుంచి స్రావం, ముక్కు నుంచి నిరంతరం స్రావం, తలనొప్పి, వేగంగా శ్వాసించడం వంటి రుగ్మతలు కలుగుతాయన్నారు. దీని నుంచి పిల్లలను రక్షించడానికి సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పీసీవీ వ్యాక్సిన్‌ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ♦ చిన్న పిల్లలకు మొదటి డోసు ఆరు వారాలకు, రెండో డోసు 14 వారాల వయసుగల వారికి, 9 నెలల వయసులో మూడవ డోసు ఇస్తారని తెలిపారు. ♦ ఇది చాలా ఖరీదైన వ్యాక్సిన్ అని, ప్రైవేటు ఆసుపత్రుల్లో ధర రూ.3 వేల వరకు ఉంటుందన్నారు. ♦ ప్రభుత్వం దీన్ని ఉచితంగా పంపిణీ చేస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ♦ ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎఎన్ఎంలు, అంగన్వాడి, ఇతర ఆరోగ్య సిబ్బందికి శిక్షణ త్వర లో పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్య క్రమంలో డాక్టర్ పద్మజ, ఎస్పీహెచ్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
వారికి సింగపూర్ బంపర్ ఆఫర్
సింగపూర్ : కరోనా మహమ్మారి సమయంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. ఈ సంక్షోభ సమయంలో బిడ్డను కనబోతున్న తల్లిదండ్రులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వారికి అదనపు సహాయాన్ని అందజేయనున్నామని ఆ దేశ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి హెంగ్ స్వీ కీట్ సోమవారం (అక్టోబర్ 5) వెల్లడించారు. ప్రజల ఆదాయ క్షీణత సంతానోత్పత్తి రేటును మరింత దెబ్బతీసే అవకాశం ఉందనే అంచనాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా వ్యతిరేక పోరాటంలో తాము స్థిరంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ తొలగింపులు, వేతన కోతల మధ్య ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం, బిడ్డ కోసం చూస్తున్న తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడానికి సింగపూర్ ఒక్కసారి చెల్లింపును అందించనుంది. ఇది ప్రస్తుతం అమలు చేస్తున్న బేబీ బోనస్‌లకు అదనమని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. అయితే బేబీ బోనస్ కింద ఇప్పటికే అర్హతగల తల్లిదండ్రులకు 10వేల డాలర్ల వరకు ప్రయోజనాలను అందిస్తున్నసంగతి తెలిసిందే. కోవిడ్-19 సమయంలో ఉపాధి లేక, ఆదాయాలు క్షీణించడంతో భార్యభర్తలు, పిల్లల్ని కనే ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారనే నివేదికల మధ్య సింగపూర్ సత్వర చర్యలకు దిగింది. సింగపూర్ సంతానోత్పత్తి రేటు 2018లో ఎనిమిదేళ్ల కనిష్టాన్ని తాకింది. కాగా దేశంలో ఇప్పటివరకు 57 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా మరణించిన వారి సంఖ్య 27. -
ఖాళీ స్థలంలో 14 శిశు మృతదేహాల కలకలం
కోల్‌కతా : దక్షిణ కోల్‌కతాలోని ఓ ఖాళీ స్థలంలో 14 శిశువుల మృతదేహాలు కనిపించటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆదివారం దక్షిణ కోల్‌కతా రాజారామమోహన్ రాయ్ సారనిలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఓ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తుండగా ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన 14 శిశువుల మృతదేహాలు కనిపించాయి. అప్పటికే కొన్ని మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండగా.. మరికొన్ని సగం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దీంతో స్థలాన్ని శుభ్రం చేస్తున్న కొంతమంది కార్మికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు దగ్గరలోని అబార్షన్ రాకెట్‌తో సంబంధమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఖాళీగా పడిఉన్న స్థలం అవటం వల్లే మృతదేహాలను అక్కడ పడవేసి ఉంటారని వారు అభిప్రాయపడ్డారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో పురిటి బిడ్డ మాయం
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పురిటి బిడ్డ అదృశ్యమైన ఘటన తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. వివరల్లోకి వెళితే.. ఏర్పేడు మండలం రావులవారి కండ్రిగ గ్రామానికి చెందిన గర్భిణి సుధ(23) డెలివరీ కోసం ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు ఆదివారం ఆడబిడ్డ పుట్టింది. కాగా.. సుధ నిద్రిస్తున్న సమయంలో పక్కనే ఉన్న బిడ్డ అదృశ్యమైంది. అర్థరాత్రి లేచి చూసేసరికి పక్కన లేకపోవడంతో.. తల్లి ఆందోళన చెంది.. సిబ్బందికి తెలిపింది. విషయం తెలిసిన సుధ బంధువులు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే పాప కనిపించకుండా పోయిందని.. ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ ఏడుపు విని తల్లి స్పందించింది..
-
ఆ ఏడుపు విని తల్లి స్పందించింది..
బిడ్డను ప్రసవించి కోమాలోకి వెళ్లిపోయింది ఆ కన్నతల్లి. ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. వైద్యులు శతవిధాల ప్రయత్నించి ఆమె ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలున్నీ బుడిదలో పోసిన పన్నీరులా తయారైంది. ఆమె బీపీ 60/40కి పడిపోయింది. హృదయ స్పందన సాధారణ స్థాయి కంటే కూడా విపరీతంగా కొట్టుకుంటోంది. చివరికి ఆమె పరిస్థితి ఎలా తయారైందంటే దినదిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. ఇక తమ వల్ల కాదని వైద్యులు చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఇంతలో పైన ఉన్న దైవుడే కరుణించాడో లేక ఆ నవ జాత శిశువుకు తల్లి అవసరం ఉందని ఆయన భావించాడో కానీ కోమాలో ఉన్న ఆమెకు సపర్యలు చేస్తున్న నర్స్‌కు ఓ ఆలోచన వచ్చేలా చేశాడు. అంతే అప్పుడే పుట్టిన శిశువుకు తల్లికి అనుబంధం ఉంటుందని అంటారు కదా అలా. కోమాలో తల్లి వద్ద శిశువును ఉంచుదామని వైద్యులుకు తెలిపింది. అంతే అనుకున్నదే తడవుగా దానిని ఆచరణలో పెట్టారు. ఆ శిశువును తల్లి వద్ద ఉంచి బుగ్గ మీద వేలుతో తట్టారు. ఆ బిడ్డ ఏడవటం ప్రారంభించింది.... ఆ ఏడుపు విని ఆ తల్లి స్పందించడం ప్రారంభించింది. దాంతో వైద్యులు ఆ శిశువును తల్లి వద్దే ఉంచి వైద్యం చేయడం ప్రారంభించారు. దాంతో తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటమే కాకుండా... ఆరోగ్యవంతురాలైంది. ఈ ఘటన గతేడాది సెప్టెంబర్‌లో యూఎస్‌లోని ఉత్తర కరోలినా ఆసుపత్రిలో ప్రసవించేందుకు వచ్చిన షెల్లీ క్వాలే జీవితంలో చోటు చేసుకుంది. ఈ మేరకు షెల్లీ క్వాలే తన జీవితంలో చోటు చేసుకున్న ఈ సంఘటనను ఇటీవల మీడియాకు వెల్లడించింది.