
శిశువుల మృతదేహాలు కనిపించిన ప్రదేశం
కోల్‌కతా : దక్షిణ కోల్‌కతాలోని ఓ ఖాళీ స్థలంలో 14 శిశువుల మృతదేహాలు కనిపించటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆదివారం దక్షిణ కోల్‌కతా రాజారామమోహన్ రాయ్ సారనిలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఓ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తుండగా ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన 14 శిశువుల మృతదేహాలు కనిపించాయి. అప్పటికే కొన్ని మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండగా.. మరికొన్ని సగం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి.
దీంతో స్థలాన్ని శుభ్రం చేస్తున్న కొంతమంది కార్మికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు దగ్గరలోని అబార్షన్ రాకెట్‌తో సంబంధమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఖాళీగా పడిఉన్న స్థలం అవటం వల్లే మృతదేహాలను అక్కడ పడవేసి ఉంటారని వారు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment