నాకు నాలుగు నెలల పాప. అంత చంటిపిల్లకు అప్పుడప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతోంది. నేను భయపడుతుంటే మా ఇంట్లో పెద్దవాళ్లేమో ‘మరేం పర్లేదు .. అలా అవడం సహజమే’ అని తేలిగ్గా తీసుకుంటున్నారు. నిజంగా పర్లేదా? అది సహజమేనా?
– పేరు, ఊరు వివరాలు రాయలేదు.
వైట్ కలర్ లేదా బ్లడ్ టైప్ వెజైనల్ డిశ్చార్జ్ పది రోజుల వయసు నుంచి ఆరు నెలల వయసు గల ఆడపిల్లల్లో చాలా నార్మల్. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంలో ఉండి.. పుట్టిన తరువాత ఒక్కసారిగా ఆ హార్మోన్ ప్రభావం నుంచి బయటపడ్డంతో ఇలా విత్‌డ్రాయల్ బ్లీడ్ లేదా డిశ్చార్జ్ కనపడవచ్చు. ఇది పుట్టినప్పటి నుంచి ఆరునెలల దాకా ఉండొచ్చు. మూడు నాలుగు రోజుల్లోనే తగ్గిపోతుంది.
క్లియర్‌గా.. స్మెల్ లేని వైట్ డిశ్చార్జ్ ఆడపిల్లల్లో ఎప్పుడైనా కనపడొచ్చు. అయితే ఇన్‌ఫెక్షన్ గనుక ఉంటే రెడ్‌నెస్, బ్యాడ్ స్మెల్, యెల్లో లేదా గ్రీన్‌కలర్ వెజైనల్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. దగ్గు, జలుబుకు ఎక్కువసార్లు యాంటీబయాటిక్స్ వాడితే వాటితో వెజైనాలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ రావచ్చు. సబ్బుతో స్నానం, టాల్కంపౌడర్స్, డియోడరెంట్ పెర్‌ఫ్యూమ్స్ వంటివాటి వల్లా.. పిల్లల ఇన్నర్‌వేర్ నుంచీ ఇరిటేషన్ రావచ్చు.
అందుకే మైల్డ్ క్లెన్సర్స్‌తో.. గోరువెచ్చని నీటిలో క్లీన్ చెయ్యాలి. పాపకు స్నానం చేయించాక వెట్ క్లాత్‌తో వెజైనల్ ఏరియాను ముందు నుంచి వెనుకగా తుడవాలి. ఔ్చbజ్చీ కింద డైపర్‌కి సంబంధించిందేమైనా ఉండిపోయి.. అది వైట్ డిశ్చార్జ్‌గా కనిపించవచ్చు. అందుకే అక్కడ శుభ్రంగా తుడవాలి. స్క్రబ్ చేయకూడదు. మెత్తటి తడి గుడ్డతోనే అదీ ముందు నుంచి వెనుకగా శుభ్రం చేయాలి. ఒక్కోసారి ఫారిన్ బాడీ ఏదైనా పొరపాటున వెజైనాలో ఉంటే కూడా తెల్లబట్ట అవుతూ ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్/ పీడియాట్రీషన్‌ని సంప్రదించడం మంచిది.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!)
Comments
Please login to add a commentAdd a comment