
ఖమ్మం సహకారనగర్: జిల్లా కాంగ్రెస్‌లో రోజు రోజుకు గ్రూపు తగాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 17న హైదరాబాద్‌లో జరగనున్న విజయ భేరి సభను జయప్రదం చేసేందుకు ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహ్మద్ ఆరిఫ్ నసీంఖాన్, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి తదితరులు పాల్గొనగా, ఖమ్మం టికెట్ బీసీలకు కేటాయించాలని పుచ్చకాయల వీరభద్రం కోరారు. వైరా నియోజకవర్గాల నాయకులు కష్టపడే వారికి గుర్తింపునివ్వాలని విన్నవించారు.
అనంతరం సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న మానవతారాయ్, మట్టా దయా నంద్ వర్గీయులు నినాదాలు చేస్తూ కుర్చీలు విసురు కున్నారు. ఇందులో ఒకరిద్ద రికి గాయాలయ్యాయి. బీసీ కేటగిరీకి చెందిన మట్టా దయానంద్‌కు ఎస్సీ రిజర్వ్ స్థానంలో టికెట్ కేటాయించొద్దని మానవ తారాయ్ అనుచరులు అడ్డు చెప్పగా, వివాదం పెరిగి దాడుల దాకా వెళ్లింది. ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో రేణుకా చౌదరి బయటకు వెళ్లారు. ఆతర్వాత టికెట్ తమకే ఇవ్వాలని మానవతా రాయ్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, డాక్టర్ మట్టా రాగమయి తదితరులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment