ఇంటర్నెట్ అన్నిచోట్లా అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో అన్నిపనులు ఎంతో సులభం అయ్యాయి. గతంలో ఇటువంటి పనుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ముఖ్యంగా ట్రైన్ టిక్కెట్ బుకింగ్ విషయంలో అందరికీ భారీ ఉపశమనం లభించింది. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో వయసు, జండర్ మొదలైనవాటిని తప్పుగా నమోదు చేస్తే రైల్వే ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తప్పులు దొర్లుతుండటం అనేది అందరి విషయంలో అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. అయితే ట్రైన్ టిక్కెట్ బుక్ చేసే సమయంలో ఎటువంటి పొరపాటు జరిగినా దాని ప్రభావం ప్రయాణంపై పడుతుంది. ఒకవేళ ట్రైన్ టిక్కెట్ బుక్ చేసే సమయంలో వయసు లేదా జండర్ తప్పుగా నమోదు చేస్తే ఆ టిక్కెట్ మార్చేందుకు అవకాశం ఉండదు.
వీటిని సరిదిద్దే అవకాశం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లేదు. అయితే కౌంటర్ దగ్గరకు వెళ్లి, ఈ పొరపాటును దిద్దుకోవచ్చా లేదా అనే విషయం కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదు. అలాగే పేరును పొరపాటుగా రాసినా కూడా దానిని మార్చుకునేందుకు అవకాశం లేదు. దీని గురించి రైల్వే అధికారులను సంప్రదించగా అక్రమాలను, మోసపూరిత చర్యలను అరికట్టేందుకే ఐఆర్‌సీటీసీ ఈ విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు.
ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం ఒకరి టిక్కెట్‌పై మరొకరు ప్రయాణించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఐఆర్‌టీసీ విధించిన నిబంధనలను ఎవరూ అతిక్రమించలేరు. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో పేరు, వయసు, జండర్ ఇలా ఏదైనా తప్పుగా లేదా పొరపాటుగా నమోదు చేస్తే, ఆ టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవడం తప్ప మరోమార్గం లేదు. అలా టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్న తరువాత సరైన రీతిలో తిరిగి టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే వయసు ఒక్కటి తప్పుగా నమోదు చేసిన సందర్భాల్లో తమకు కేటాయించిన సీటును కాపాడుకునేందుకు వీలైనంత త్వరగా సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడి రిజర్వేషన్ సూపర్‌వైజర్‌ను సంప్రదించి, జరిగిన పొరపాటు గురించి తెలియజేయాలి. అప్పడు అతను దానిపై అధికారికి స్టాంపు వేస్తారు. అప్పుడు ఈ టిక్కెట్‌కు వయసు నిర్ధారిత పత్రాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది.
మీరు టిక్కెట్ నమోదులో జరిగిన పొరపాటును గుర్తించిన 24 గంటల ముందుగానే ఈ పని చేయాలి. అయితే ఈ ప్రయత్నం చేసినా సఫలం అవుతుందనే గ్యారెంటీ ఏమీ లేదు. రిజర్వేషన్ సూపర్‌వైజర్ నిర్ణయంపై ఇది ఆధారపడివుంటుంది. ఇదేవిధంగా సంబంధిత ట్రైన్ టీటీని సంప్రదించి, తగిన ఐడెంటిటీ చూపిస్తే, ఆయన మానవత్వ దృష్టితో మీ పొరపాటును గ్రహించి, ఆ టిక్కెట్‌తో ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించవచ్చు.
ఇది కూడా చదవండి: రూ. 8 కోట్లు కొట్టేసి.. ఫ్రీ ఫ్రూటీకి దొరికిపోయింది!
Comments
Please login to add a commentAdd a comment