న్యూఢిల్లీ: మహాకుంభమేళాకు వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గల సంగమ నది ఒడ్డున భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం(ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవి వీఐపీ తరహాలో ఉండనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.
ఈ సౌకర్యాలను అందుకునేందుకు ఈరోజు(శనివారం) నుంచి బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సంగమంలో ప్రత్యేకంగా టెంట్ సిటీని సిద్ధం చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. దీనికి మహాకుంభ్ గ్రామ్ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ఈ టెంట్ సిటీ ప్రయాగ్‌రాజ్‌కు పర్యాటక రంగంలో కొత్త గుర్తింపుగా మారనుంది. దీనిలో బస చేసేందుకు భక్తులు బుకింగ్ చేసుకోవచ్చు.
Mahakumbh Mela 2025: మహాకుంభమేళా జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే..
ఐఆర్‌సీటీసీ డైరెక్టర్ (పర్యాటకం, మార్కెటింగ్) రాహుల్ హిమాలయన్ మాట్లాడుతూ డేరా నగరంలో బస చేసేందుకు ఒక వ్యక్తికి రాత్రికి రూ. 6000 (పన్నులు అదనంగా) చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇలా బుక్ చేసుకున్నవారికి అల్పాహారంతో సహా డబుల్ ఆక్యుపెన్సీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ బుకింగ్ రద్దు చేసుకుంటే సొమ్ము రిఫండ్ ఇవ్వనున్నామన్నారు. టెన్త్ సిటీలో బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. కస్టమర్ సపోర్ట్ (వాయిస్) ఫోను నంబరు 1800110139కు కాల్ చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: సహకార రంగంలో 11 కోట్ల ఉద్యోగాలు
Comments
Please login to add a commentAdd a comment