Adipurush Movie Release: Theatre Owners Decorate Reserved Seat For Hanuman, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Adipurush: హనుమాన్‌కు కేటాయించిన సీట్‌ ఇదే..

Published Fri, Jun 16 2023 7:42 AM | Last Updated on Fri, Jun 16 2023 8:56 AM

Adipurush Theatre Owners Decorate Reserved Seat For Hanuman - Sakshi

రెబల్​ స్టార్​ ప్రభాస్​, కృతి సనన్​ లీడ్​ రోల్స్‌లో​ తెరకెక్కిన 'ఆదిపురుష్​'  శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో 'ఆదిపురుష్‌' టీమ్‌ ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆ సీటును ఎలా ఏర్పాటు చేశారనే ఉత్కంఠ నెలకొంది.  

(ఇదీ చదవండి: Adipurush: దశరథుడి పాత్రలో ఎవరు నటించారో తెలిస్తే...)

తాజాగా ఆ సీటుకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆ సీటును కాషాయ వస్త్రంతో కప్పి.. హనుమంతుని ఫోటోను పెట్టి.. జై శ్రీరామ్ అంటూ చైర్‌పై రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. థియేటర్‌లో ఈ సీటుకు అభిమానులు పూజలు కూడా చేస్తున్నారు. థియేటర్‌ యాజామాన్యం కూడా హనుమాన్‌కు కేటాయించిన సీటుకు పూల మాలలతో డెకరేషన్‌ చేశారు. విజయవాడలోని శైలజ థియేటర్‌లో హనుమంతుని కోసం J1 సీటును కేటాయించారు. సినిమా ప్రదర్శన ఉన్నన్ని రోజులు ఆ టికెట్‌ అమ్మబడదని వారు తెలిపారు. అంతేకాకుండా సినిమా ఆడినన్ని రోజులు శైలజ ధియేటర్‌లో శ్రీరామునికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు.

(ఇదీ చదవండి: ఆదిపురుష్‌ ట్విటర్‌ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement