ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్. రామయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా, కృతిసనన్ సీతగా దర్శనమివ్వనుంది. 400కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 జూన్ 16న విడుదల కానుంది.
ఇటీవల రామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమా కొత్త పోస్టర్‌ని విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రామ భక్తుడు, రాముడి ఆత్మ.. జై పవన్‌పుత్ర హనుమాన్!’ అని క్యాప్షన్ ఇస్తూ, రామభక్తిలో మునిగిపోయిన హనుమంతుని పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ చిత్రంలో హనుమంతుడిగా దేవదత్ నాగే నటించారు.
ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటినుంచి ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి.మొన్నటికి మొన్న రామనవమి సందర్భంగా విడుదల చేసిన లుక్‌లో కూడా రాముడు, సీత, లక్ష్మణుడి వేషధారణపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి తాజాగా విడుదలైన పోస్టర్‌తో ఇంకేమైనా వివాదాలు తలెత్తుతాయా అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment