
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీకి పోటీ చేయాల నుకునే బీజేపీ ఆశావహుల నుంచి పార్టీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ తొలిరోజున సోమవారం 182 దరఖాస్తులు అందగా, రెండోరోజు మంగళవారం మరో 178 అందినట్టు పార్టీవర్గాల సమాచారం. ముహూర్తాలు, మంచిరోజు చూసుకునే వారికి మంగళవారం అంత మంచిరోజు కాదనే అభిప్రాయం ఉంటుంది.
అయితే మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడం విశేషం. సిరిసిల్ల నుంచి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, మహేశ్వరం నుంచి బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కోలన్ శంకర్‌రెడ్డి, కార్వాన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టాల ఉమారాణి తదితరులు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు.
ఈ నెల 10 దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ కావడంతో రాబోయే రోజుల్లో ఆశావహుల తాకిడి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో మంచిరోజులు ఉండడంతో, పార్టీ ముఖ్య నేతలతో పాటు ఇతరులు కూడా ఈ మూడురోజుల్లోనే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు.
క్రిమినల్ రికార్డ్ కోసం ఓ పేజీ
దరఖాస్తులో ఆశావహులు తమపై ఉన్న క్రిమి నల్ కేసులు, శిక్షలు పడిన కేసుల వివరాలు, వాటి సంపూర్ణ సమాచారం వెల్లడించాలనే నిబంధన పెట్టారు. మూడు పేజీల దరఖాస్తు పత్రంలో రెండు పేజీలు వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాల కోసం కేటాయించగా పూర్తిగా ఒక పేజీ క్రిమినల్ కేసుల సంబంధిత వివరాల కోసం కేటాయించారు.
క్రిమినల్ కేసులున్న ట్టైతే ఎఫ్‌ఐఆర్, పోలీస్‌స్టేషన్ చిరునామా, ఫోన్ నంబర్లు, కేసు వివరాలు, ఏయే సెక్షన్ల కింద ఏయే అభియోగాలు మోపారు, వాటిపై అప్పీ లుకు వెళ్లారా లేదా? కోర్టు పరంగా ఏవైనా ప్రొ సీడింగ్స్ ఉంటే వాటిపై పిటిషన్లు దాఖలు చేశారా? తదితర వివరాలన్నీ తెలియజేయా లని సూచించారు. ఏవైనా కేసుల్లో శిక్ష పడితే వాటి వివరాలు..ఏకోర్టులో, ఏ సెక్షన్ కింద పడింది? అనే వివరాలతో పాటు నమోదైన నేరానికి సంబంధించి క్లుప్తంగా సమాచారం. శిక్ష వేస్తూ వెలువడిన ఉత్తర్వులు, తదితర వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment