ప్రతీకాత్మక చిత్రం
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎయిర్ లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి.
అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 1000 మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టిక్కెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది.
ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే..
రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటీఎం ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు లభిస్తాయి. ఆఫర్‌ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment