
సాక్షి,రాజమండ్రి: మహిళల ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. మహిళ భద్రతపై కళాశాలలు,సోషల్ మీడియాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. మహిళల రక్షణ కోసం పటిష్ట చర్యలు చేపట్టేందుకు మహిళా కమిషన్ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎస్‌ఐ అనురాధల విషయంలో ఏం జరిగిందో పోలీసులను వివరణ కోరామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. పోలీసుల వివరణ పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment