మన ఫోన్‌కి అదే పనిగా కాల్స్ వస్తేనే చాలా చికాకుగా ఉంటుంది. అలాంటిది అదే పనిగా మిస్డ్ కాల్స్ వస్తే అబ్బా ఏంటిది అని విసుగ్గా అనిపిస్తుంది. కానీ యూకేకి చెందిన ఒక మహిళకి ఏకంగా 4500 మిస్డ్ కాల్స్ వచ్చాయంటా తెలుసా!.
(చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో)
అసలు విషయంలోకెళ్లితే....యూకేలోని ఉత్తర ఐర్లాండ్‌లోని బాంగోర్‌కు చెందిన హెలెన్ ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్‌తో నిండిపోయింది. అయితే ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్‌ని హెల్ప్ లైన్ నెంబర్ అని తప్పగా భావించడంతో ఆమెకు తెగ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్‌కి డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎకానమీ డెలివరీ చేసిన స్పెండ్ లోకల్ స్కీమ్ ఫోన్ నెంబర్‌కి ఒక అంకె తేడా ఉండటంతో వారు తప్పుగా హెలెన్ బిజినెస్ కాంటాక్ట్ నెంబర్‌ని ఇచ్చారు.
దీంతో ఆ లోకల్ స్కీమ్‌కి చెందిన కస్టమర్‌లంతా తమ కార్డు బ్యాలెన్స్ చెక్ చేయండి అంటూ హెలెన్స్‌కి రకరకాలు కాల్స్ చేశారు. అయితే వారిలో కొంతమంది వృద్ధుల ఉంటే వారికి తనవంతుగా సాయం చేసింది. మరికొందరికి అసలు విషయాన్ని వివరించింది కూడా. ఏది ఏమైనా ఎన్ని కాల్స్ రిసీవ్ చేసుకోగలరు ఎవరైనా. చివరికి ఆమె ఇక మిగతా ఏ కాల్‌ని రిసీవ్ చేసుకోవడం మానేసింది. దీంతో ఆమె ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్‌తో నిండిపోయింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎకానమీ సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment