మహిళా రక్షణ బాధ్యత పురుషుల మీదే ఉందని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి అన్నారు. గురువారం ఉదయం స్థానిక భృంగీ కళాశాల ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన మహిళా భద్రత ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి వ్యక్తికి విద్య తప్పని సరి అవసరం అని అన్నారు.
చాలా మంది విద్యార్థినులు, మహిళలు సమస్యలతో తమలో తామే బాధపడుతున్నారనీ.. ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులకు నిర్భయంగా చెప్పాలని సూచించారు. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ఎంతో కృషి చేస్తోందని వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చ్చిన సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ మాట్లాడుతూ పురుషులు తప్పు చేస్తున్నాడంటే దానికి తల్లిదండ్రులే కారణమని అన్నారు. మహిళల భద్రత కోసం హెల్ప్‌లైన్(9502403147) నెంబర్‌ను ప్రారంభించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై నిర్మించిన ఓ లఘు చిత్రాన్ని యూ టూబ్‌లో ఆప్‌లోడ్ చేశారు.