Rama Rajeshwari
-
అలం‘పురం’ ఉలిక్కిపాటు
అలంపూర్ రూరల్: తెల్లవారుతుండగా అలంపూర్‌లో పోలీసులు బలగాలు దిగాయి.. ప్రజలంతా గాడ నిద్రలో ఉండగా పోలీసులు ఇళ్లు తట్టడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోదాలు చేస్తున్నామని.. మీ ఆధార్‌కార్డులు.. వాహనాల పత్రాలు.. ఇళ్ల పత్రాలు చూయించాలని అడిగితే ముందు ప్రజలకు విషయం ఏంటో అర్థం కాక తికమక పడ్డారు. తర్వాత శాంతిభద్రతల కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారని చెప్పడంతో ఊపరిపి పీల్చుకున్నారు. ఎస్పీ రెమారాజేశ్వరి నేతృత్వంలో.. అలంపూర్‌లో మంగళవారం తెల్లవారుఝామున 4గంటల నుంచి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 80 మంది పోలీసులు, ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఏడు మంది ఎస్ఐలు 8 బృందాలుగా విడిపోయి అలంపూర్ పట్టణాన్ని జల్లెడ పట్టారు. కాలనీల్లో తిరుగుతూ ఇళ్లల్లో సోదాలు, వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. ఒక్కో బృందం ఒక్కో కాలనీలో పర్యటించింది. ఇళ్లల్లో ఎవరైన కొత్త వ్యక్తులు ఉన్నారా.? వారు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు.? ఏ పని నిమిత్తం ఇక్కడ మకాం వేశారు. వారి ఆధార్ నెంబర్లు ఎక్కడున్నాయి.. ఇలా వివిధ కోణాల్లో ప్రశ్నలు వేస్తూ ప్రజలను విచారణ చేశారు. అనుమానం వచ్చిన వారిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజ నిర్ధారణ చేసుకుని వదిలేశారు. అలాగే వాహనాలను నిలిపి వాటి పత్రాలను పరిశీలించారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పత్రాలు చూయించిన వారి వాహనాలను మళ్లి వారికి అప్పగించారు. ప్రజలతో ఎస్పీ మాటామంతి.. పోలీసులు ఉన్నట్టుండి ఎందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు..? ఎవరికైనా తెలుసా.. పోలీసులు మీ ఇళ్లకు వచ్చారా.? ఏం అడిగారు.? చెప్పండి అంటూ ఎస్పీ రెమారాజేశ్వరి స్థానిక ప్రజలను ప్రశ్నించారు. దీన్ని కార్డెన్ సెర్చ్ అంటారని, నేరాలను అదుపు చేసేందుకు ముందస్తుగా ప్రజల భద్రత కోసమే ఇలా చేస్తున్నామని తెలిపారు. నేరాలు.. ఘోరాలు జరిగిపోయాక స్పందించడం కంటే ముందస్తుగా వాటిపై దృష్టి పెట్టి ఆపేందుకు ఉపయోగపడుతుందన్నారు. కొత్త వ్యక్తులకు ఎవరు ఆశ్రయం ఇవ్వొద్దని.. వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని... నిజనిర్ధారణ చేసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని కోరారు. వాహనాల కొనుగోలు సమయాలలో కూడా పూర్తి పత్రాలను సరి చూసుకోవాలని లేని పక్షంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని అప్రమత్తం చేశారు. ఇదిలాఉండగా పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా పోలీసుశాఖ పేద డిపార్ట్మెంట్ అని.. తమ వద్ద ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఉండవని.. ప్రజల సహకారంతోనే సీసీ కెమరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తనిఖీల్లో డీఎస్పీ సురేందర్‌రావు, సీఐ రజిత, సీఐ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, ఎస్ఐలు వాస ప్రవీణ్‌కుమార్ విజయ్, గడ్డం కాశీ, పర్వతాలు, మహేందర్, భాగ్యలక్ష్మిరెడ్డి తదితరులు ఉన్నారు. -
సత్ప్రవర్తనతో మెలగాలి
గద్వాల క్రైం: పాతకక్షలకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం గద్వాల డీఎస్పీ కార్యాలయం ఆవరణలో పాత నేరస్తులు, రౌడీషీటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గద్వాల, గట్టు, ధరూర్, అయిజ, శాంతినగర్, ఉండవెల్లి, రాజోళి, మల్దకల్ తదితర మండలాల్లో 166మందిపై రౌడీషీట్ నమోదు అయ్యిందని తెలిపారు. గతంలో ఉన్న గొడవలు, పాతకక్షలు మనస్సులో పెట్టుకొని తోటి స్నేహితులు, రక్త సంబంధీకులు ఇరుగు పొరుగు వారితో క్షణికావేశంలో ఘర్షణ పడటం తగదన్నారు. ఈ క్రమంలోనే హత్యలు చేస్తున్నారని, లేదా తీవ్రంగా గాయపడి వైకల్యంతో బాధపడుతున్నా రని అన్నారు. దీనివల్ల బాధిత కుటుంబా లు రోడ్డున పడుతున్నాయని, తల్లిదండ్రులకు, పిల్లలకు దూరమవుతున్నారని చెప్పారు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలిగితే ఎలాంటి అనర్థాలు రావని చెప్పా రు. ఇకనుంచి సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని సూచిం చారు. మీలో మార్పు వస్తే మొదట మీ కుటుంబమే బాగుపడుతుందని చెప్పారు. సత్ప్రవర్తన కలిగిన నేరస్తులపైకేసులు తొలగిస్తాం మద్యం, జూదం, మాట్కా, హత్యలు, కిడ్నాప్‌లు, దొంగతనాలు, ఇతర నేరా లకు చోటివ్వకుండా సత్ప్రవర్తనతో జీవించే వారిపై కేసులు తొలగిస్తామని ఎ స్పీ చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉందని తెలిపారు. పోలీసులు ఎప్పటికప్పుడు మీ ప్రవర్తనపై నిఘా ఉంచి, ఉన్నతాధికారులకు మీ వివరాలు అందిస్తారన్నారు. అనంతరం గద్వాల డీఎస్పీ సురేందరావు కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామ, పట్టణంలో సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు అందించి, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఐలు, వెంకటేశ్వర్లు, రజిత, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు విజయ్, మురళీధర్‌గౌడ్, మదుసూదన్‌రెడ్డి, మహేందర్, వెంకటేశ్వర్లు, నవీన్‌సింగ్, పర్వతాలు, ప్రవీణ్, జగదీశ్ ఉన్నారు. -
'మహిళా రక్షణ బాధ్యత మగవారిదే'
మహిళా రక్షణ బాధ్యత పురుషుల మీదే ఉందని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి అన్నారు. గురువారం ఉదయం స్థానిక భృంగీ కళాశాల ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన మహిళా భద్రత ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి వ్యక్తికి విద్య తప్పని సరి అవసరం అని అన్నారు. చాలా మంది విద్యార్థినులు, మహిళలు సమస్యలతో తమలో తామే బాధపడుతున్నారనీ.. ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులకు నిర్భయంగా చెప్పాలని సూచించారు. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ఎంతో కృషి చేస్తోందని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చ్చిన సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ మాట్లాడుతూ పురుషులు తప్పు చేస్తున్నాడంటే దానికి తల్లిదండ్రులే కారణమని అన్నారు. మహిళల భద్రత కోసం హెల్ప్‌లైన్(9502403147) నెంబర్‌ను ప్రారంభించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై నిర్మించిన ఓ లఘు చిత్రాన్ని యూ టూబ్లో ఆప్‌లోడ్ చేశారు.