కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా.. | Rs 31 lakh compensation for the damaged car submerged in water | Sakshi
Sakshi News home page

కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా..

Sep 16 2024 11:49 AM | Updated on Sep 16 2024 11:49 AM

Rs 31 lakh compensation for the damaged car submerged in water

మునిగిన కారుకు రూ.31 లక్షల పరిహారం 

రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ తీర్పు

హైదరాబాద్‌: అది 2020 అక్టోబర్‌ నెల.. హైదరాబాద్‌ నగరంలో కురిసిన భారీ వర్షాలు కురిశాయి. ఓ సర్వీస్‌ సెంటర్‌ నిర్లక్ష్యం వల్ల వరదల్లో కారు మునిగిపోయింది. పరిహారం కోసం బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో రూ.31 లక్షల పరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ సర్వీస్‌ సెంటర్‌ను ఆదేశిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. సర్వీస్‌ కోసం వచ్చిన కారును బయటకు తీయకుండా కారు పూర్తిగా దెబ్బతినడానికి సర్వీస్‌ సెంటర్‌ సిబ్బందే కారణమని కమిషన్‌ తేల్చింది. ఈ పరిహారాన్ని 45 రోజుల్లోపు పిటిషనర్‌కు చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలు సీహెచ్‌ లతాకుమారి, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, శ్యామలతో కూడిన బెంచ్‌ తీర్పును ఇచ్చింది.  

కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా.. 
హైదరాబాద్‌లోని బ్లూ ఓషన్‌ మల్టీ క్టయింట్‌ ఆఫీస్‌ వారు 2015లో రూ.51 లక్షలు వెచ్చించి వోల్వో కారును కొనుగోలు చేశారు. 2019లో కారు అకస్మాత్తుగా ఎయిర్‌ కండీషన్‌ పనిచేయకుండా ఆగిపోయింది. అంతేగాకుండా ఇంజిన్‌ వేడెక్కి ప్రమాదకరంగా మారింది. దీంతో వెంటనే పిటిషనర్‌ తల్వార్‌ కార్స్‌ ప్రైవేట్‌ సర్వీస్‌ సెంటర్‌ దగ్గర రూ.83 వేలు వెచ్చించి రిపేరు చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే కారులో మళ్లీ సమస్యలు వచ్చాయి. కారు ఏసీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పలు రకాల సమస్యలు ఏర్పడ్డాయి.

 దీంతో కారు యజమాని 2020లో కృష్ణ ఎక్స్‌క్లూజీవ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సర్వీస్‌ సెంటర్‌ను సంప్రదించగా కారు రిపేరు కోసం రూ.2.73 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కారు రిపేరు కోసం సర్వీస్‌ సెంటర్‌లోనే పెట్టుకున్నారు. 2020లో భారీ వర్షాలు కురిసి వరదలు రావడంతో సర్వీస్‌ సెంటర్‌లోకి నీరు వచి్చ, కారు మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో కారు రిపేరు కోసం రూ.50.45 లక్షల వరకు ఖర్చు అవుతుందని సర్వీస్‌ సెంటర్‌ సిబ్బంది అంచనా వేసి చెప్పారు.

 సరైన సమయానికి కారు రిపేరు చేయకుండా పెట్టి వరదల్లో మునిగిపోవడానికి కారణం అయిన సర్వీస్‌ సెంటర్‌ సిబ్బంది దీనికి పూర్తి బాధ్యత వహించాలని పిటిషనర్‌ సూచించాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో పిటిషనర్‌ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్‌ కారు పూర్తిగా దెబ్బతినడానికి కృష్ణ ఎక్స్‌క్లూజీవ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సర్వీస్‌ సెంటర్‌ కారణమని తేల్చింది. అందుకు పైన తెలిపిన విధంగా పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచి్చంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement