పాములను తక్కువ అంచనా వేశారో ఇక అంతే సంగతి అని హెచ్చరిస్తున్నారు స్నేక్ క్యాచర్ 34 ఏళ్ల మురళీధర్ యాదవ్. అతను పాముల నుంచి రక్షించే ఓ హెల్స్‌లైన్‌ను కూడా నడుపుతున్నాడు. ఎవ్వరూ పాము వల్ల ఇబ్బంది పడినా అతనికి సమాచారం అందిస్తే చాలు అతను వచ్చి రక్షిస్తాడు. ఆ పాములను సురక్షిత ప్రాంతాల్లో వదలడం వంటవి చేస్తాడు. అలాగే సోషల్ మీడియా వేదిక పాముల పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా తమను తాము కాపాడుకోవాలో వంటి వాటిపట్ల ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాడు యాదవ్. ఈ సందర్భంగా ఆ వ్యక్తి తాను ఏవిధంగా స్నాక్ క్యాచర్‌గా మారింది. ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గూరించి వెల్లడించాడు.
యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లాకు చెందినవాడు. ఆ రాష్ట్రంలో అతని రక్షకుడిగా పిలుస్తారు. ఈ 23 ఏళ్లలో అతను సుమారు 8 వేలకు పైనే పాములను పట్టుకుని ప్రజలను రక్షించాడు. ఇదేమి అంత సులువైన చిన్న పిల్లల ఆట కాదని అంటున్నాడు. తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం వివరిస్తూ..తన చిన్ననాటి రోజుల్లో జాన్‌పూర్‌లో చాలా పాములు ఉండేవని, పాము కాటు కేసులు కూడా ఎక్కువగానే ఉండేవని చెప్పుకొచ్చాడు. తాను పాము కాటు, దాని కారణంగా చనిపోయిన వారి గురించి వింటూ పెరగడంతో..దీని కోసం తనవంతుగా ఏదైనా చేయాలని అనుకునే వాడని పేర్కొన్నాడు యాదవ్.
ఆ క్రమంలో మా పొరుగింటి వ్యక్తి ఇంట్లోకి పాము రావడంతో..దాన్ని పట్టడంలో సాయం చేయాల్సిందిగా పిలిచినప్పుడూ..తాన చాలా చాకచక్యంగా ఆ పాముని పట్టుకుని వాళ్లను రక్షించాను. ఇక అప్పటి నుంచి అలా ఎన్నో రెస్కూలు చేస్తూనే ఉన్నాడు యాదవ్. ఓ ఘటన మాత్రం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. రెస్క్యూలో భాగంగా ఒక చోట పామును పట్టుకోవడానికి వెళ్తే..తాను ఎదుర్కొన్న చేదు అనుభం ఓ గొప్ప పాఠాన్ని నేర్పింది. పామే కదా అని పరాగ్గా ఉన్నాం అంతే కాటేసి చంపేందుకు రెడీ అవుతుందని. వాటిపట్ల చాలా జాగురుకతతో ఉండాలని హెచ్చరిస్తున్నాడు.
తాను అప్పుడు పొరుగు గ్రామంలో పాము పట్టుకోవడానికి వెళ్లాను ఆ రోజు పామును పట్టుకోవడానికి ఏకంగా రెండు గంటలపైనే పట్టేసింది. ఇక పాముని పట్టుకుని పెట్టేలో పెడుతున్నా.. అంతే ఇంతో ఒక్క ఊదుటన తన చేతిపై గట్టిగా కాటు వేసిందని నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. సమీపంలో ఉన్నవాళ్లు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇది ప్రమాదకరమైన సాహసంతో కూడిన వృత్తి.
అలాగే ప్రజల్లో పాముల పట్ల, అవి కాటేస్తే ఏం చేయాలి అనే దానిపై చాలా అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాను సాధనంగా ఎంచుకుని యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నట్లు తెలిపాడు. కాగా, యాదవ్‌కి యూటబ్యూబ్‌కి దాదాపు 85 లక్షల సబ్‌స్రైబర్లు ఉండగా, ఫేస్‌బుక్‌లో సుమారు 46 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. అంతేగాదు తన కొడుకు కూడా ఇదే వృత్తిలోకి రావాలనుకుంటున్నట్లు గర్వంగా చెబుతున్నాడు యాదవ్.
(చదవండి: చాక్లెట్ గుట్టులుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?..)
Comments
Please login to add a commentAdd a comment