ముంబై: బావిలో పడ్డ చిరుతను రక్షించి ఆటవీ శాఖకు అప్పగించిన స్నేక్ క్యాచర్స్‌పై నెటిజన్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరుతను అతి కష్టంగా రక్షించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనవరి 15న షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 6 వందలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వస్తున్నాయి. వివరాలు.. మహరాష్ట్రలోని ఓ గ్రామంలోని చిరుత కొద్ది రోజులుగా సంచరిస్తోంది. ఈ క్రమంలో చిరుత ఊరి చివరన ఉన్న బావిలో పడిపోవడంతో గ్రామస్తులు ఆటవీ శాఖకు సమాచారం అందించారు.
గ్రామస్తుల సమాచారం మేరకు ఆటవీ సిబ్బందితో పాటు స్నేక్ క్యాచర్ టీం కూడా అక్కడి చేరుకుంది. అనంతరం బావిలో పడ్డ చిరుతను పైకి తీసుకువచ్చేందుకు వారు రక్షణ చర్యలు చేపట్టారు. 8 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో చిరుతను బోనులో ఎక్కించేదుకు స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్‌తో పాటు అతడి టీం తీవ్రంగా శ్రమించింది. ఇక చివరకు చిరుతను బోనులోకి ఎక్కించి దానిని ఆటవీ శాఖకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment