Leopardess caught
-
చిక్కిన చిరుతపులి మృతి
సాక్షి, భువనేశ్వర్: గంజాం జిల్లా దక్షయ ఘముసర అటవీ డివిజన్ బుగుడా రేంజ్ పరిధిలోని నగురు గ్రామ శివారులో గ్రామస్తులు అడవి పందుల కోసం వేసిన వలలో గురువారం చిరుతపులి చిక్కుకుంది. సమాచారం అందుకున్న దక్షయ ఘముసర అటవీ డివిజన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుతపులిని అధీనంలోకి తీసుకొన్నారు. వెటర్నరీ వైద్యుల సాయంతో చికిత్స అందించారు. అయితే చిరుతపులి తీవ్ర అనారోగ్యంతో శుక్రువారం మృతి చెందిందని అటవీశాఖ డివిజనల్ అధికారి సత్యనారాయణ బౌరా తెలిపారు. సుమారు ఏడాదిన్నర వయస్సున్న ఈ జీవాన్ని నిబంధనల ప్రకారం ఘుమసరా అటవీ ప్రాంతంలో పూడ్చినట్లు వెల్లడించారు. -
బావిలో పడ్డ చిరుత.. రక్షించిన స్నేక్ క్యాచర్ టీం
ముంబై: బావిలో పడ్డ చిరుతను రక్షించి ఆటవీ శాఖకు అప్పగించిన స్నేక్ క్యాచర్స్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరుతను అతి కష్టంగా రక్షించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనవరి 15న షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 6 వందలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వస్తున్నాయి. వివరాలు.. మహరాష్ట్రలోని ఓ గ్రామంలోని చిరుత కొద్ది రోజులుగా సంచరిస్తోంది. ఈ క్రమంలో చిరుత ఊరి చివరన ఉన్న బావిలో పడిపోవడంతో గ్రామస్తులు ఆటవీ శాఖకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఆటవీ సిబ్బందితో పాటు స్నేక్ క్యాచర్ టీం కూడా అక్కడి చేరుకుంది. అనంతరం బావిలో పడ్డ చిరుతను పైకి తీసుకువచ్చేందుకు వారు రక్షణ చర్యలు చేపట్టారు. 8 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో చిరుతను బోనులో ఎక్కించేదుకు స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్‌తో పాటు అతడి టీం తీవ్రంగా శ్రమించింది. ఇక చివరకు చిరుతను బోనులోకి ఎక్కించి దానిని ఆటవీ శాఖకు అప్పగించారు. -
ఆ ఆడ చిరుతను పట్టేశారు!
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఓ బాలికను హతమార్చి, మరో యువకుడిని గాయపరిచిన ఆడ చిరుతపులిని అటవీ శాఖాధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. టిర్లా బ్లాకులోని సోడలియా గ్రామ శివార్లలోని అడవుల్లో ఏర్పాటుచేసిన బోనులో ఈ చిరుత చిక్కుకుంది. గత నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నామని.. ఎలాగైతే దాన్ని పట్టుకోగలిగామని ధార్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి గౌరవ్ చౌదరి తెలిపారు. మార్చి 18వ తేదీన ఈ చిరుత 12 ఏళ్ల బాలికను చంపేసింది. మరో 18 ఏళ్ల యువకుడిని కూడా గాయపరిచింది. చిరుతను పట్టుకుని కమలానెహ్రూ జూకు తరలించారు. దాని ముక్కు, తోక భాగాలలో చిన్నపాటి గాయాలు కావడంతో చికిత్స చేయిస్తున్నట్లు జూ ఇన్చార్జి ఉత్తమ్ యాదవ్ తెలిపారు.