ఆ ఆడ చిరుతను పట్టేశారు! | Leopardess trapped after attack on villagers | Sakshi
Sakshi News home page

ఆ ఆడ చిరుతను పట్టేశారు!

Published Sat, Mar 21 2015 7:45 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

ఆ ఆడ చిరుతను పట్టేశారు!

ఆ ఆడ చిరుతను పట్టేశారు!

మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఓ బాలికను హతమార్చి, మరో యువకుడిని గాయపరిచిన ఆడ చిరుతపులిని అటవీ శాఖాధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. టిర్లా బ్లాకులోని సోడలియా గ్రామ శివార్లలోని అడవుల్లో ఏర్పాటుచేసిన బోనులో ఈ చిరుత చిక్కుకుంది. గత నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నామని.. ఎలాగైతే దాన్ని పట్టుకోగలిగామని ధార్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి గౌరవ్ చౌదరి తెలిపారు.

మార్చి 18వ తేదీన ఈ చిరుత 12 ఏళ్ల బాలికను చంపేసింది. మరో 18 ఏళ్ల యువకుడిని కూడా గాయపరిచింది. చిరుతను పట్టుకుని కమలానెహ్రూ జూకు తరలించారు. దాని ముక్కు, తోక భాగాలలో చిన్నపాటి గాయాలు కావడంతో చికిత్స చేయిస్తున్నట్లు జూ ఇన్చార్జి ఉత్తమ్ యాదవ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement