భోపాల్: పెళ్లిలో వరుడు షేర్వాణీ ధరించడంపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా మంగ్‌బడా గ్రామం ఇందుకు వేదికైంది. వరుడు షేర్వాణీ వేసుకోగా గిరిజన సంప్రదాయానుసారం ధోతీ, కుర్తా మాత్రమే ధరించాలంటూ అమ్మాయి తరఫువాళ్లు పట్టుబట్టారు.
దీనిపై చెలరేగిన వాగ్వాదం ముదిరి అమ్మాయి, అబ్బాయి తరఫువారు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీనిపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. షేర్వాణీపై పెళ్లికూతురి తల్లిదండ్రులు అభ్యంతరపెట్టకున్నా వారి బంధువులే రగడ చేశారంటూ పెళ్లికొడుకు ముక్తాయించాడు. ఆ తర్వాత పెళ్లి నిరాటంకంగా జరిగిపోవడం విశేషం!
చదవండి👉 అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ‍్యండి
Comments
Please login to add a commentAdd a comment