dhar district
-
అమానుషం: మహిళపై కర్రతో దాడి.. వీడియోలు తీసిన జనం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై కొందరు వ్యక్తులు విచక్షనారహితంగా దాడి చేశారు. బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగానే కర్రతో కొట్టారు. అయితే చుట్టూ ఉన్న వారు దీన్నంతటినీ వీడియోలు తీస్తూ.. ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారే తప్ప అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపేందుకు ముందుకు రాకపోవడం సిగ్గుచేటు.మోదీ కేబినెట్లో కేంద్రమంత్రిగా నియమితులైన సావిత్రి ఠాకూర్ స్వగ్రామమైన ధార్ జిల్లాలోని తండా ప్రాంతంలోఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.మహిళను కొందరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే కర్రతో దారుణంగా కొట్టారు. నలుగురు వ్యక్తులు మహిళను పట్టుకోగా.. ఓ వ్యక్తి బలమైన కర్రతో కొడుతూ కనిపించాడు. ఈ దాడిలో తనను కాపాడండి అంటూ ఆ మహిళ ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. పైగా అక్కడ జరుగుతున్న దాన్ని తమ సెల్ఫోన్లలో రికార్డు చేస్తూ చోద్యం చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.#MadhyaPradesh का जिला धार..बेटी बचाओ का नारा था.. मगर यह लोग तो बेटियों पर खुलेआम जुल्म कर रहे है। @DGP_MP#आदिवासी_हिंदू_नहीं_हैं#मदन_दिलावर_माफी_मांगों Atal Setu Rs 1Sudi Ram Ram The Star योगी आदित्यनाथ Israel Nazis pic.twitter.com/tLZR7t5bS1— Abdul Qadir khan (@AbdulKh10143143) June 22, 2024 మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ పాలనలో మహిళల భద్రత లేదంటూ మండిపడింది. మధ్యప్రదేశ్‌లో వేధింపులు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించింది. మహిళలపై అఘాయిత్యాలలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని విరుచుకుపడింది. వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని నూర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని ధార్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురి దుర్మరణం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గుణాలోని జాతీయ రహదారిపై( NH46) మంగళవారం పొగమంచు కమ్ముకోవడంతో స్పీడ్‌గా వచ్చిన ఓ ట్రక్కు ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా.. వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. దాదాపు 40 టన్నులతో కూడిన స్రాప్తో వెళ్తున్న ట్రక్కు.. కారును ఓవర్ టేక్ చేయసే ప్రయత్నంలో అదుపుతప్పి కారుపై దూసుకెళ్లింది. మృతులను రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ సాయంతో బాధితుల తుల బంధువులను సంప్రదించారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించడపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. VIDEO | Four killed in a road accident near Guna, Madhya Pradesh. More details are awaited. pic.twitter.com/OivWSq6pJm — Press Trust of India (@PTI_News) December 26, 2023 అదేవిధంగా ధార్ జిల్లాలోని ఆగ్రా-ముంబయిజాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి ముందున్న అయిదు వాహనాల పైకి దూసుకెళ్లింది. దీంతో ఒకదానితో ఒకటి ఢీకొని ఆరు వాహనాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో ట్రక్కుతోపాటు మరో అయిదు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. #WATCH | Dhar, Madhya Pradesh: A major accident occurred at Ganesh Ghat located on the Agra-Mumbai National Highway where six vehicles, including cars and one truck, caught fire after colliding with each other. Police and fire brigade on the spot. Efforts to douse the fire are… pic.twitter.com/FD8KVrE3L1 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 25, 2023 -
మరీ బిత్తిరితనం.. పెళ్లి కొడుకు షేర్వాణీ ధరించడంతో ఏకంగా రాళ్లతో...
భోపాల్: పెళ్లిలో వరుడు షేర్వాణీ ధరించడంపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా మంగ్‌బడా గ్రామం ఇందుకు వేదికైంది. వరుడు షేర్వాణీ వేసుకోగా గిరిజన సంప్రదాయానుసారం ధోతీ, కుర్తా మాత్రమే ధరించాలంటూ అమ్మాయి తరఫువాళ్లు పట్టుబట్టారు. దీనిపై చెలరేగిన వాగ్వాదం ముదిరి అమ్మాయి, అబ్బాయి తరఫువారు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీనిపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. షేర్వాణీపై పెళ్లికూతురి తల్లిదండ్రులు అభ్యంతరపెట్టకున్నా వారి బంధువులే రగడ చేశారంటూ పెళ్లికొడుకు ముక్తాయించాడు. ఆ తర్వాత పెళ్లి నిరాటంకంగా జరిగిపోవడం విశేషం! చదవండి👉 అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ్యండి -
రైతులను దారుణంగా చితకబాదారు..
-
రైతులను దారుణంగా చితకబాదారు..
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆరుగురు రైతులను గ్రామస్తులు దారుణంగా చితకబాదారు. కర్రలు, దుంగలతో కొట్టడమే కాకుండా వారిపైకి పెద్ద పెద్ద బండరాళ్లను విసిరారు. రైతులు వచ్చిన రెండు కార్లను ధ్వంసం చేశారు. వారిని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లాయ్ వరకు తరిమి తరిమి కొట్టారు. వారిలో ఒక రైతు అక్కడికక్కడే మరణించగా, మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఖిరికియా గ్రామంలో బుధవారం ఈ దారుణ సంఘటన జరగ్గా పోలీసులు గురువారం 15 మంది నిందితులను అరెస్ట్ చేసి వారిపై హత్యానేరం మోపారు. ఈ సంఘటనను స్థానిక జర్నలిస్ట్ ఒకరు వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా, ఇప్పుడది వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం పొరుగూరికి చెందిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఖిరికియా గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలకు అడ్వాన్స్ కింద లక్షా యాభై వేల రూపాయలు ఇచ్చారు. డబ్బులు తీసుకొని పనికి రాకుండా ఎగ్గొడుతున్న ఆ కూలీలను డబ్బులన్నా ఇవ్వాల్సిందిగా రైతులు కోరారు. తమ ఊరికొస్తే డబ్బులిస్తామని కూలీలు వారికి నచ్చ చెప్పారు. వారి మాటలు నమ్మి గ్రామానికి వచ్చిన ఆరుగురు రైతులను ఊరు శివారున ముగ్గురు కూలీలు మరికొందరితో కలిసి అడ్డుకొని కొట్టడం ప్రారంభించారు. ఇదేమిటని అక్కడికొచ్చిన గ్రామస్తులు అడగ్గా, పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చిన దొంగలంటూ కూలీలు అబద్ధమాడారు. దాంతో మరికొంత మంది గ్రామస్తులు ఆ కూలీలతో చేతులు కలిపి రైతులను చితకబాదారు. అక్కడ గుమికూడిన ప్రజలంతా చోద్యం చూస్తున్నట్టుగా చూస్తూ తమ తమ సెల్ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీసు అధికారి మాత్రం ముక దాడిని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం 40మందిపై కేసు నమోదు కాగా, ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. -
బోనులో చిక్కిన చిరుత
ఇండోర్: మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. తండా ఫారెస్ట్ రేంజ్ లో సాద్లియాగన్ గ్రామంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కిందని ధార్ డివిజినల్ అటవీశాఖ అధికారి గౌరవ్ చౌదురి తెలిపారు. వరుస దాడులతో హడలెత్తించిన చిరుతపులి పట్టుబడడంతో ధార్ జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల 9, 16 తేదీల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులపై చిరుత దాడి చేసి గాయపరించింది. బోనులో చిక్కిన చిరుతను కమలా నెహ్రూ జూకు తరలించినట్టు చౌదురి తెలిపారు. ఈ క్రూరమృగం పూర్తి ఆరోగ్యంతో ఉందని చెప్పారు. -
ఆ ఆడ చిరుతను పట్టేశారు!
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఓ బాలికను హతమార్చి, మరో యువకుడిని గాయపరిచిన ఆడ చిరుతపులిని అటవీ శాఖాధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. టిర్లా బ్లాకులోని సోడలియా గ్రామ శివార్లలోని అడవుల్లో ఏర్పాటుచేసిన బోనులో ఈ చిరుత చిక్కుకుంది. గత నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నామని.. ఎలాగైతే దాన్ని పట్టుకోగలిగామని ధార్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి గౌరవ్ చౌదరి తెలిపారు. మార్చి 18వ తేదీన ఈ చిరుత 12 ఏళ్ల బాలికను చంపేసింది. మరో 18 ఏళ్ల యువకుడిని కూడా గాయపరిచింది. చిరుతను పట్టుకుని కమలానెహ్రూ జూకు తరలించారు. దాని ముక్కు, తోక భాగాలలో చిన్నపాటి గాయాలు కావడంతో చికిత్స చేయిస్తున్నట్లు జూ ఇన్చార్జి ఉత్తమ్ యాదవ్ తెలిపారు.