ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురి దుర్మరణం | Madhya Pradesh Road Accidents At Guna AND Dhar districts 7 Died | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదాలు.. కాలి బూడిదైన ఆరు వాహనాలు.. ఏడుగురి దుర్మరణం

Published Tue, Dec 26 2023 1:38 PM | Last Updated on Tue, Dec 26 2023 1:50 PM

Madhya Pradesh Road Accidents At Guna AND Dhar districts 7 Died - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో  రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గుణాలోని జాతీయ రహదారిపై( NH46) మంగళవారం పొగమంచు కమ్ముకోవడంతో స్పీడ్‌గా వచ్చిన ఓ ట్రక్కు ముందున్న కారును బలంగా ఢీకొట్టింది.  దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా.. వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు.

దాదాపు 40 టన్నులతో కూడిన స్రాప్‌తో వెళ్తున్న ట్రక్కు.. కారును ఓవర్‌ టేక్‌ చేయసే ప్రయత్నంలో అదుపుతప్పి కారుపై దూసుకెళ్లింది. మృతులను  రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ సాయంతో బాధితుల తుల బంధువులను సంప్రదించారు.  పొగమంచు కారణంగా  రోడ్డు కనిపించడపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

అదేవిధంగా  ధార్‌ జిల్లాలోని ఆగ్రా-ముంబయిజాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు బ్రేక్‌ ఫెయిలై అదుపు తప్పి ముందున్న అయిదు వాహనాల పైకి దూసుకెళ్లింది. దీంతో ఒకదానితో ఒకటి ఢీకొని ఆరు వాహనాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో ట్రక్కుతోపాటు మరో అయిదు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.  మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement