catchers
-
పామే కదా ! అని పరాగ్గా ఉంటే..స్నేక్ క్యాచర్ అయినా అంతే సంగతి!
పాములను తక్కువ అంచనా వేశారో ఇక అంతే సంగతి అని హెచ్చరిస్తున్నారు స్నేక్ క్యాచర్ 34 ఏళ్ల మురళీధర్ యాదవ్. అతను పాముల నుంచి రక్షించే ఓ హెల్స్‌లైన్‌ను కూడా నడుపుతున్నాడు. ఎవ్వరూ పాము వల్ల ఇబ్బంది పడినా అతనికి సమాచారం అందిస్తే చాలు అతను వచ్చి రక్షిస్తాడు. ఆ పాములను సురక్షిత ప్రాంతాల్లో వదలడం వంటవి చేస్తాడు. అలాగే సోషల్ మీడియా వేదిక పాముల పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా తమను తాము కాపాడుకోవాలో వంటి వాటిపట్ల ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాడు యాదవ్. ఈ సందర్భంగా ఆ వ్యక్తి తాను ఏవిధంగా స్నాక్ క్యాచర్‌గా మారింది. ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గూరించి వెల్లడించాడు. యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లాకు చెందినవాడు. ఆ రాష్ట్రంలో అతని రక్షకుడిగా పిలుస్తారు. ఈ 23 ఏళ్లలో అతను సుమారు 8 వేలకు పైనే పాములను పట్టుకుని ప్రజలను రక్షించాడు. ఇదేమి అంత సులువైన చిన్న పిల్లల ఆట కాదని అంటున్నాడు. తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం వివరిస్తూ..తన చిన్ననాటి రోజుల్లో జాన్‌పూర్‌లో చాలా పాములు ఉండేవని, పాము కాటు కేసులు కూడా ఎక్కువగానే ఉండేవని చెప్పుకొచ్చాడు. తాను పాము కాటు, దాని కారణంగా చనిపోయిన వారి గురించి వింటూ పెరగడంతో..దీని కోసం తనవంతుగా ఏదైనా చేయాలని అనుకునే వాడని పేర్కొన్నాడు యాదవ్. ఆ క్రమంలో మా పొరుగింటి వ్యక్తి ఇంట్లోకి పాము రావడంతో..దాన్ని పట్టడంలో సాయం చేయాల్సిందిగా పిలిచినప్పుడూ..తాన చాలా చాకచక్యంగా ఆ పాముని పట్టుకుని వాళ్లను రక్షించాను. ఇక అప్పటి నుంచి అలా ఎన్నో రెస్కూలు చేస్తూనే ఉన్నాడు యాదవ్. ఓ ఘటన మాత్రం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. రెస్క్యూలో భాగంగా ఒక చోట పామును పట్టుకోవడానికి వెళ్తే..తాను ఎదుర్కొన్న చేదు అనుభం ఓ గొప్ప పాఠాన్ని నేర్పింది. పామే కదా అని పరాగ్గా ఉన్నాం అంతే కాటేసి చంపేందుకు రెడీ అవుతుందని. వాటిపట్ల చాలా జాగురుకతతో ఉండాలని హెచ్చరిస్తున్నాడు. తాను అప్పుడు పొరుగు గ్రామంలో పాము పట్టుకోవడానికి వెళ్లాను ఆ రోజు పామును పట్టుకోవడానికి ఏకంగా రెండు గంటలపైనే పట్టేసింది. ఇక పాముని పట్టుకుని పెట్టేలో పెడుతున్నా.. అంతే ఇంతో ఒక్క ఊదుటన తన చేతిపై గట్టిగా కాటు వేసిందని నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. సమీపంలో ఉన్నవాళ్లు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇది ప్రమాదకరమైన సాహసంతో కూడిన వృత్తి. అలాగే ప్రజల్లో పాముల పట్ల, అవి కాటేస్తే ఏం చేయాలి అనే దానిపై చాలా అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాను సాధనంగా ఎంచుకుని యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నట్లు తెలిపాడు. కాగా, యాదవ్‌కి యూటబ్యూబ్కి దాదాపు 85 లక్షల సబ్స్రైబర్లు ఉండగా, ఫేస్బుక్లో సుమారు 46 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. అంతేగాదు తన కొడుకు కూడా ఇదే వృత్తిలోకి రావాలనుకుంటున్నట్లు గర్వంగా చెబుతున్నాడు యాదవ్. (చదవండి: చాక్లెట్ గుట్టులుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?..) -
బస్సులో నాగుపాము రభస
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం కెఎస్ఆర్టిసి బస్టాండు నుంచి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని శిడ్లఘట్ట వైపు వెళుతుండగా బస్సులో కలకలం రేగింది. అందరూ ఏమిటా అని చూడగా ఒక నాగుపాము బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణికులు భయంతో ఒకరిపై ఒకరు పడి కిందకు దిగడానికి ప్రయత్నించారు. ఈ అల్లరితో పాము ఇంజన్ వద్దకు జారుకుంది. పాముల నిపుణుడు పృథ్వీరాజ్‌ను పిలిపించగా, ఆయన పామును పట్టి దూరంగా వదిలేశారు. బస్సు శిడ్లఘట్టకు వెళ్లిపోయింది. (చదవండి: అయ్యో పాపం.. ప్లాస్టిక్ దారంతో విలవిల్లాడిన అడవి కుక్క) -
మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి!
లక్నో: పాములు పట్టేవాడు.. ఏదో ఒకనాడు దాని కాటుకే బలవుతాడంటారు. ఇది నిజమని నిరూపించింది ఇక్కడో ఘటన. ఊరిలో పాములు పట్టి వాటిని కాపాడే యత్నం చేసే ఓ వ్యక్తి.. తన ‘అతి’ చేష్టలతో, నిర్లక్ష్యంతో దాని కాటుకే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా పరిధిలోని జైతీపూర్ గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దేవేంద్ర మిశ్రా అనే వ్యక్తి అప్పుడప్పుడు గ్రామంలో, చుట్టుపక్కల ఊళ్లలో ఇళ్లలో దూరిన పాముల్ని పట్టి.. వాటిని ఊరి బయట అడవుల్లో సురక్షితంగా వదిలేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రవీంద్ర అనే వ్యక్తి ఇంట్లో కట్లపాము దూరిందన్న సమాచారం అందుకున్నాడు. ఆ విష సర్పాన్ని ఓ కర్ర సాయంతో అతి సులువుగా పట్టుకుని.. దానితో ఊరంతా కలియదిరిగాడు. అక్కడితో ఆగకుండా దానిని ఓ చిన్నారి మెడలో వేసి ప్రదర్శించి.. ఆపై తన మెడలోనూ వేసుకుని ఊరంతా తిరిగాడు. అలా రెండు గంటలు గడిచిన తర్వాత.. పాము తల పట్టుసడలి అతన్ని కాటేసింది. వెంటనే దానిని మళ్లీ బంధించి.. ఓ కుండలో బంధించాడు. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా.. ఆకు పసర్లతో గాయానికి చికిత్స చేసుకున్నాడు అతను. ఆపై ఇంటికి చేరుకుని పడుకున్నాడు. పాము మరీ విషపూరితం కావడంతో.. అవేం పని చేయక అతని ప్రాణం పోయింది. అటు కుండ కింద ఉంచిన పాము కూడా చచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. సకాలంలో వైద్యం అంది ఉంటే అతని ప్రాణం దక్కేదని వైద్యులు చెప్తున్నారు. ఇదీ చదవండి: లాడ్జిలో రిమాండ్ ఖైదీ సరసాలు -
బావిలో పడ్డ చిరుత.. రక్షించిన స్నేక్ క్యాచర్ టీం
ముంబై: బావిలో పడ్డ చిరుతను రక్షించి ఆటవీ శాఖకు అప్పగించిన స్నేక్ క్యాచర్స్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరుతను అతి కష్టంగా రక్షించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనవరి 15న షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 6 వందలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వస్తున్నాయి. వివరాలు.. మహరాష్ట్రలోని ఓ గ్రామంలోని చిరుత కొద్ది రోజులుగా సంచరిస్తోంది. ఈ క్రమంలో చిరుత ఊరి చివరన ఉన్న బావిలో పడిపోవడంతో గ్రామస్తులు ఆటవీ శాఖకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఆటవీ సిబ్బందితో పాటు స్నేక్ క్యాచర్ టీం కూడా అక్కడి చేరుకుంది. అనంతరం బావిలో పడ్డ చిరుతను పైకి తీసుకువచ్చేందుకు వారు రక్షణ చర్యలు చేపట్టారు. 8 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో చిరుతను బోనులో ఎక్కించేదుకు స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్‌తో పాటు అతడి టీం తీవ్రంగా శ్రమించింది. ఇక చివరకు చిరుతను బోనులోకి ఎక్కించి దానిని ఆటవీ శాఖకు అప్పగించారు. -
స్నేక్ క్యాచర్ కిరణ్ @ 22,370
డాబాగార్డెన్స్/ఆరిలోవ: పాము పేరు వింటేనే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. కలలో కనిపించినా భయంతో వణికిపోతారు. ఇక కళ్ల ముందు పాము కనిపించిందంటే వాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. చివరకు పాము బుసకొట్టిన శబ్దం వినిపించినా భయంతో బిగదీసుకుపోతారు. అయితే కిరణ్‌కు పాము కనిపిస్తే చాలు.. ఎవరైనా వాటికి హాని చేస్తారేమోనని ఆందోళన చెందుతారు. అయ్యో పాపం అంటూ దానిని పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లి వదిలేస్తారు. అన్ని పాములు హానికరం కావని, అవి మానవులకు ఒక విధంగా స్నేహితుల లాంటివని చెబుతున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పాములు పట్టడంతో ఆయనది ఓ ప్రత్యేకమైన స్టైల్. నగరంలో ఎక్కడ పాము కనిపించినా.. మొదట కిరణ్ పేరే వినిపిస్తుంది. అది.. నగరంలోనే రద్దీగా ఉండే డాబాగార్డెన్స్ ప్రాంతం. పార్కింగ్ చేసిన ఓ కారులో కొండ చిలువ ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. పెద్దగా కేకలు వేశారు. నాలుగైదడుగుల కొండచిలువ పందికొక్కును మింగుతూ ఉండడాన్ని గమనించారు. జనం హడావిడితో అది బెదిరి కారులోకి దూరింది. ఓ ధైర్యవంతుడు కారు యజమాని వద్ద తాళం తీసుకుని.. కారును అంబేడ్కర్ కూడలి చుట్టూ తిప్పి వచ్చాడు. కానీ కొండచిలువ కారు దిగలేదు. ఈ లోగా రద్దీ పెరిగిపోయింది. ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహన యజమాని గత్యంతరం లేక కారును బీచ్‌రోడ్డులోకి తీసుకెళ్లాడు. ఇంతలో ఎవరో స్నేక్ క్యాచర్ కిరణ్‌కు ఫోన్ చేశారు. గాజువాకలో ఉన్న కిరణ్ హుటాహుటిన బీచ్‌రోడ్డుకు వచ్చాడు. కారులో చిక్కుకుపోయిన పామును తీసేందుకు శత విధాలా ప్రయత్నించాడు. ఫలితం లేదు. మరోదారి లేక సమీపంలో ఉన్న కారు గ్యారేజీకి తీసుకెళ్లారు. ఫలితం లేకపోయింది. చివరకు కారు కొనుగోలు చేసిన షోరూంకు తీసుకెళ్లి చెక్ చేయించారు. ఎట్టకేలకు స్నేక్ కిరణ్ చేతికి కొండ చిలువ చిక్కింది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ ద్వారా కిరణ్‌కు గుర్తింపు వచ్చింది. మానవాళి మనుగడకు సహాయపడుతున్న పాములను రక్షించాల్సిన మనం.. అవి కనిపిస్తే చాలు చంపేవరకు నిద్రపోం. కిరణ్ మాత్రం ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎంతటి విష సర్పం కనిపించినా.. వీటిని కంటికి పాపలా కాపాడడంతో పాటు సమీపంలోని అడవిలో వదిలి పెడుతుంటారు. రొక్కం లక్ష్మినారాయణ, వరలక్ష్మిల దంపతుల చిన్న కుమారుడు కిరణ్. ఇప్పటికే విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లో 22,370 పాములు పట్టి సమీపంలోని అడవుల్లోకి విడిచిపెట్టి పలువురి మన్ననలు పొందారు. పలు అవార్డులు, రివార్డులు పొందారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కిరణ్ పాములను ఎవరైనా చంపితే తట్టుకోలేనని అంటారు. ఇలా మొదలైంది వ్యవసాయ కుటుంబం కావడంతో తన సొంతూరైన మిందిలో తాతతో సాయంత్రం వేళల్లో పంట పొలాలకు వెళ్తుండేవాడు. పొలాల్లో పాములు కనిపిస్తే.. చుట్టుపక్కల ఉన్న రైతులు కొట్టి చంపడాన్ని చూసి పదేళ్ల వయసులోనే బాధపడేవారు. అప్పుడే పాములను కాపాడాలనే దృఢ సంకల్పం కలిగిందని, అప్పటి నుంచి అవి కనిపిస్తే పట్టుకుని జన సంచారానికి దూరంగా వదిలిపెట్టేవాడినని కిరణ్ తెలిపారు. సేవలకు గుర్తింపు పర్యావరణానికి మేలు కలిగించే పాములకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా 2000లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2001లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏక్వీరా బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంతో పాటు మూడు యూనియన్లు కలిసి ఉమ్మడిగా 2006లో ఇంటిని కేటాయించాయి. కిరణ్ సేవలు విశాఖ ప్రజలకు ఎంతగానో అవసరమని గ్రహించిన జీవీఎంసీ కమిషనర్ అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పించడంతో కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఎంతటి విష సర్పాలైనా.. ఇళ్లు, కార్యాలయాల్లోకి చొరబడ్డ పాముల కదలికలను పసిగట్టి చాకచక్యంగా పట్టుకోగల సమర్థుడు కిరణ్. అలా ఇప్పటి వరకు వివిధ రకాల 22,370 పాములు పట్టుకున్నారు. వీటిలో భయంకర విషసర్పాలైన పొడ, రక్త పింజర, కట్లపాము, నాగుపాము, జెర్రిగొడ్డు, పిట్వైపర్, కోబ్రా, నాగజాతి పాములు ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్ పరిధిలోనే 10వేల పైబడి పాములు పట్టుకున్నారు. ఇలా పట్టుకున్న పాములను నేరుగా జూలో క్యూరేటర్ దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ రికార్డులో నమోదు చేసి సిబ్బందికి పాములు అప్పగించేస్తారు. కొన్నింటిని జూ సిబ్బంది సమక్షంలో తొట్లకొండ, కంబాలకొండ ప్రాంతాల్లో విడిచిపెడుతుంటారు. ఫోన్ చేయండి.. సాధారణంగా పాములు మనుషులను హాని చేయవు. కేవలం భయపెట్టడానికి మాత్రం బుసకొడతాయి. వాటిని హింసించినా, చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అవి కాటు వేస్తాయి. పాము కనబడగానే అటవీ శాఖ అధికారులను గానీ.. పాములు పట్టే వారిని గానీ పిలిస్తే మనుషులకు, పాములకు హాని ఉండదు. 18 మందితో రెస్క్యూ టీం నడుస్తోంది. పాములు పట్టే విషయంలో ఎవరికీ ఎలాంటి సాయం కావాలన్నా.. 9849140500, 8331840500 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. – రొక్కం కిరణ్‌కుమార్, స్నేక్ క్యాచర్ -
మంచినీటికి మంచి మార్గం
శాంటియాగో: భూగర్భంలో జల వనరులు తరగిపోయినప్పుడు వర్షాల కోసం ఆకాశంవైపు దిక్కులు చూడడం తప్పా చేసేదేమీ లేదనుకుంటే పొరపాటు. అలా దిక్కులు చూడడం నుంచి కూడా జల వనరుల సమీకరణకు కొత్త దిక్కు కనిపిస్తుందని చిలీ రాజధాని శాంటియాగో నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనా బ్లాంకా అనే ఓ చిన్న గ్రామం ప్రజలు నిరూపించారు. ఈ గ్రామం ప్రజలంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వర్షాలు లేవు. పర్యవసానంగా భూగర్భంలో జలవనరులు అడుగంటి పోయాయి. అంత లోపలి వరకు బోరింగ్లు వేసే స్థోమత కూడా ఈ గ్రామం ప్రజలకు లేదు. మరి ఏం చేయాలి? ఈ గ్రామంలో పొగ మంచు ఎప్పుడూ కనిపిస్తుంటోంది. బలమైన గాలులు కూడా వీస్తుంటాయి. ఆ కారణంగా సూర్యరశ్మి కూడా ఎక్కువగా ఉండదు. ఆ పొగమంచులోని నీటిని ఒడిసిపట్టుకుంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన గ్రామ పెద్దలకు కలిగింది. ఎలా ఒడిసి పట్టుకోవడం ? గ్రామ పెద్దలు చదువుకున్న తమ పిల్లలను అడిగారు. పొగమంచు వచ్చే దిశగా తాళ్లతో అల్లిన జాలీలు కడితే పొగమంచులోని నీటిని తాళ్లు లాగేసుకుంటాయని, తాళ్ల తెర అడుగు భాగాన ఓ గొట్టాన్ని ఏర్పాటుచేసి నీటిని డ్రమ్ముల్లోకి నింపవచ్చని ఎవరో ఐడియా ఇచ్చారు. అంతే! ఆరోజు నుంచి గ్రామం నీటి కష్టాలు తీరిపోయాయి. విద్యుత్ కూడా అవసరం లేకుండా స్వచ్ఛమైన నీటిని వాతావరణం నుంచే ఒడిసి పట్టుకునే విద్యను వారు నేర్చుకున్నారు. వారు గ్రామం పొలిమేరలో 140 చదరపు మీటర్ల జాలి తెరలను ఏర్పాటు చేయడం ద్వారా రోజుకు 840 లీటర్ల స్వచ్ఛమైన నీటిని సేకరిస్తున్నారు. దీంతో వారి తాగునీటి అవసరాలు, వ్యవసాయ అవసరాలు తీరిపోతున్నాయి. వాస్తవానికి చిలీలో ఇలా నీటిని ఒడిసిపట్టుకునే విధానం 1950 దశకంలోనే అమల్లో ఉంది. సరైన ప్రోత్సాహం లేక అది కాలగర్భంలో కలసి పోయింది. మళ్లీ ఈ విధానానికి ఇప్పుడు ప్రోత్సాహం లభిస్తోంది. మొరొక్కోలో ఇప్పుడు ‘దార్ సి హమద్’ ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద ఎత్తున మంచుపొగ నుంచి నీటిని సేకరిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ జమీలా బర్గాచ్ 2016 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి నుంచి అవార్డు కూడా అందుకున్నారు. నీటి వనరులు అతి తక్కువగా ఉండే సహారా ఎడారిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నీటి తెరలను ఏర్పాటు చేసి ఎడారిలో కూడా చెట్లను పెంచుతున్నారు.