బస్సులో నాగుపాము రభస    | Cobra In Bus Creates Chaos At Karnataka | Sakshi
Sakshi News home page

బస్సులో నాగుపాము రభస   

Published Sun, Aug 28 2022 10:36 AM | Last Updated on Sun, Aug 28 2022 10:58 AM

Cobra In Bus Creates Chaos At Karnataka - Sakshi

చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం కెఎస్‌ఆర్‌టిసి బస్టాండు నుంచి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని శిడ్లఘట్ట వైపు వెళుతుండగా బస్సులో కలకలం రేగింది. అందరూ ఏమిటా అని చూడగా ఒక నాగుపాము బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణికులు భయంతో ఒకరిపై ఒకరు పడి కిందకు దిగడానికి ప్రయత్నించారు.

ఈ అల్లరితో పాము ఇంజన్‌ వద్దకు జారుకుంది. పాముల నిపుణుడు పృథ్వీరాజ్‌ను పిలిపించగా, ఆయన పామును పట్టి దూరంగా వదిలేశారు. బస్సు శిడ్లఘట్టకు వెళ్లిపోయింది.   

(చదవండి: అయ్యో  పాపం.. ప్లాస్టిక్‌ దారంతో విలవిల్లాడిన అడవి కుక్క)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement