ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ ద్వివేదికి సంబంధించిన ‘పాము కాటు’ ఉదంతం ఆసక్తికరంగా మారింది. తనకు బద్దశత్రువుగా మారిన సర్పం పీడను వదిలించుకోవడానికి 11 రోజులుగా వికాస్ రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు. అయినా కూడా వికాస్ ఎనిమిదోసారి పాము కాటుకు గురైనట్లు సమాచారం. అయితే..
దేవుని దయతో వికాస్‌కు ఏమీకాలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాము కాటు వేసిన తర్వాత కూడా వికాస్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. అయితే పాము వికాస్ దగ్గరకు రావడాన్ని, వెళ్లడాన్ని తాము చూడలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏడుసార్లు పాము కాటుకు గురైన వికాస్ వికాస్ జూలై 13న మెహందీపూర్ బాలాజీ ఆశ్రమానికి వచ్చాడు.
ఆయన జూలై 14న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కలలో పాము కనిపించిందని, జూలై 20న పాము తనను ఎనిమిదవసారి కాటేస్తుందని చెప్పాడు. అయితే అలాంటి ఘటనేమీ జరగలేదు. కానీ, 22న సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో పాము మరోసారి వికాస్‌ను కాటేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
వికాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పాము తనను కాటు వేయడానికి వచ్చినప్పుడల్లా, తన ఎడమ కన్ను కొట్టుకుంటుందని తెలిపాడు. సోమవారం కూడా అలానే జరిగిందని చెప్పాడు. మరోవైపు ఇటీవల తనకు కూడా పాము కల వచ్చిందని వికాస్ తండ్రి సురేంద్ర ద్వివేది తెలిపారు. తన కుమారుడిని పాము కాటువేయగా, అతను చనిపోవడాన్ని తాను కలలో చూశానని పేర్కొన్నాడు. కాగా బాలాజీ టెంపుల్ ట్రస్టు వికాస్‌కు ఆశ్రయం కల్పిస్తూ సాయం అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment