హైదరాబాద్‌లో కరోనా ఇంటింటి సర్వే మొదలైంది. వేసవి కాలంలో వచ్చే తాటిముంజలు నోరూరిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూలు అమలవుతున్నాయి.
1/9
కోవిడ్ టెస్టులు, టీకాల కోసం జనం గంటల తరబడి క్యూల్లో వేచి ఉంటున్నారు. వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం నాటి పరిస్థితి ఇది.
2/9
కరోనా ఇంటింటి సర్వేలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల ప్రజలకు ఫీవర్ చెక్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
3/9
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రోగి సహాయకులను అనుమతించడం లేదు. తమవాళ్లు ఎలా ఉన్నారో అని పేషెంట్ల బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారికి భోజనం తదితర వస్తువులు అందించడానికి వచ్చి అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని వేడుకుంటున్న దృశ్యాలు గురువారం కనిపించాయి.
4/9
వేసవిలోనే దర్శనమిచ్చే తాటిముంజలు నోట్లో వేసుకుంటే జారిపోయేలా తాటి కన్నుల లోపల నీరుతో శరీరానికి చలువను అందించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెద్దపల్లి జెండా కూడలి వద్ద గురువారం రామయ్యపల్లి గ్రామానికి చెందిన దంపతులు ఇలా తాటి ముంజలు అమ్ముతుంటే కొనేందుకు స్థానికులు మక్కువ చూపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
5/9
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ కొనసాగుతోంది. గుంటూరులో.. కర్ఫ్యూ విధించక ముందు, కర్ఫ్యూ విధించిన తరువాత కనిపించిన దృశ్యాలివి.
6/9
జమ్మూలోని చాతీవ్యాధుల ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో బయటే ఆక్సిజన్ సపోర్టుతో వేచి ఉన్న కోవిడ్ బాధితులు
7/9
న్యూఢిల్లీలో లాక్‌డౌన్ కారణంగా గురువారం రాత్రి బోసిపోయి కనిపిస్తున్న ఎయిమ్స్ ఫ్లైఓవర్
8/9
కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గుజరాత్‌లోని సూరత్‌లో విమానం ఆకృతిలో ఏర్పాటు చేసిన సిరంజీ
9/9
ఢిల్లీలోని ఓ శ్మశానవాటికలో అంత్యక్రియల అనంతరం భద్రపరిచిన కోవిడ్ బాధితులు సహా ఇతరుల చితాభస్మమిది. లాక్‌డౌన్ కారణంగా నిమజ్జనం చేసేందుకు వీలులేక మృతుల కుటుంబసభ్యులు వాటిని ఇక్కడే కలశాల్లో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment